Monday, November 17, 2008

కళాకారుల జీవితాలు కల్లోల సాగరాలు

copy from AJ.


http://www.andhrajyothy.com/archives/archive-2008-11-17/editshow.asp?qry=/2008/nov/17vividha1




కళాకారుల జీవితాలు కల్లోల సాగరాలు
- డా.జామిసన్‌ (వైద్యురాలు)
- పెన్నా శివరామకృష్ణ

తీవ్రమైన ప్రతిస్పందనాశీలత వల్ల కళాకారులు తొందరగా ఉద్వేగాలకు లోనవుతుంటారు. బుద్ధికంటే వీరికి హృదయమే ప్రధానం. విశ్లేషణా దృష్టికంటే సంశ్లేషణాదృష్టి వీరిలో ఎక్కువ. భౌతిక, ఆంతరంగిక జీవితాలకు, గతానికి వర్తమానానికి, వ్యక్తావ్యక్తాలకు, బుద్ధికి హృదయానికి, వ్యక్తిగత సాంఘిక జీవితాలకు, సృజన, లౌకిక జీవితాలకు మధ్య వీరు అనుక్షణం ఊయలలూగుతుంటారు.

సృజనలో వారు పొందే గొప్ప ఆనందం ముందు లౌకిక సుఖ సంతోషాలన్నీ తృణప్రాయంగానే కనిపిస్తాయేమో! భౌతిక జీవితం కంటే ఆంతరిక జీవితానికే ప్రాముఖ్యమిస్తారు. వ్యక్తిగత జీవితం, దేహారోగ్యం, సమయ పాలనల కంటే తమ కళా సృజనే ఉత్క­ృష్టమైనదిగా భావిస్తారు. వీటన్నింటి వల్ల కళాకారులలో ఏదో ఒక మేరకు క్రమశిక్షణా రాహిత్యం సాధారణ లక్షణంగా కనిపిస్తుంది.

'Being a published poet is more dangerous than being a deep-sea diver' -యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌ అయిన జేమ్స్‌ డబ్ల్యు.పెన్‌బేకర్‌ అభిప్రాయమిది. ఆయన మాటలు ప్రతి కళాకారునికీ వర్తిస్తాయి. ఇతర వృత్తుల వారితో పోల్చుకుంటే అధిక శాతం కళాకారుల జీవనశైలి విలక్షణంగా ఉంటుంది.. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణను, సామాజిక 'నైతిక' విలువలను గొప్ప కళాకారులు తోసిరాజనడానికి కారణాలేమిటి?

స్వబుద్ధికంటే స్వఇచ్ఛకే ప్రాధాన్యమివ్వడమే కారణమా? మనస్సును నిగ్రహించుకోలేని తత్వమే 'సృజనాత్మకత'కు మూలమా? సృజన కోసం తపన, సంఘర్షణ, సృజనానందం, సృజనాహంకృతి 'బుద్ధి'ని తృణీకరిస్తున్నాయా? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు జవాబులను అన్వేషించే ప్రయత్నమే ఈ వ్యాసం. గర్భవతి ప్రసవం వరకు అనుభవించే బాధలను, తీసుకునే జాగ్రత్తలను కళాకారుని సృజనకు పూర్వదశతో (లేదా కృతాద్యవస్థతో) పోల్చవచ్చు.

కళా సృజనే ప్రసవం. బాలారిష్టాలను అధిగమింపజేసి శిశువు ఆలనా పాలనా చూస్తూ బాల్యాన్ని దాటించి తన కాళ్ళమీద తాను నిలబడి వ్యక్తిగా ఎదిగేవరకు తల్లి (తండ్రితో పాటు) పర్యవేక్షిస్తుంటుంది. తన కళారూపానికి తగిన సవరణలు, పూరణలు చేస్తూ, దానిని కళాభిమాని వద్దకు చేర్చడానికి కళాకారుడు పడే కష్టనష్టాలను ప్రసవానంతరం తల్లి స్థితిగతులతో పోల్చవచ్చు.

సృజనకు పూర్వం, సృజన దశలో, సృజనానంతరం కళాకారుని మానసిక స్థితిని ఇతరులకంటే తోటి కళాకారుడు మాత్రమే కొంతవరకైనా అర్థం చేసుకోగలడు. కనుక ప్రతి కళాకారుడూ సామాజిక పరిణామాలను, తదనుగుణంగా తన కళా మాధ్యమంలో వస్తున్న మార్పులను 'జాగ్రత్త'గా గమనిస్తూనే తన అభిరుచులకు ప్రతిభా పాటవాలకు తగిన వస్తు వ్యక్తీకరణల్లో పరిణతి సాధిస్తూ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం నిత్య సంఘర్షణాయుతం. సామాజిక చైతన్యం కలిగిన కళాకారుడు వివిధ వ్యవస్థలలో వస్తున్న అనూహ్య పరిణామాల వెనుకనున్న చారిత్రిక కారణాలను విశ్లేషించుకోగలగాలి.

ప్రతి పరిణామానికీ వివిధ స్థల కాలాలలో పరిణామంలో గతి భేదాలకూ, భౌగోళిక, చారిత్రిక రాజకీయ సామాజిక స్థితిగతులకూ అవినాభావ సంబంధముంటుందని గ్రహించాలి. ఆంతరిక, సృజనాత్మక జీవితమూ, కౌటుంబిక జీవితమూ, వృత్తి జీవితమూ, సాధారణ లౌకిక జీవితమూ వీటన్నింటికీ విడివిడిగా న్యాయం చేస్తూనే వీటన్నింటి మధ్య తగిన సమన్వయం సాధించాలనేది బహుశా కళాకారులందరి అంతర్గత కాంక్ష. సృజనకు అవసరమైన స్థల కాలాలను మిగుల్చుకోవడానికి, తాను సాధించిన ప్రగతిని పరోక్షంగా ఇతరులకు తెలియజెప్పడానికి కళాకారుడు పడే ఆరాటం అందరికీ అర్థం కాదు.

కళారూపం ఎలా రూపొందుతుందోనన్న భయం, పూర్తి అయిన తర్వాత దానిని లోకం ఎలా స్వీకరిస్తుందోనన్న 'యాంగ్జయిటీ'లే మనిషి ప్రవర్తనకు, మానసిక రుగ్మతలకు మూలాలని ఫ్రాయిడ్‌ అంటాడు. ప్రపంచ సాహిత్యంలో అధిక భాగం ఉద్వేగాల అణచివేత, దాని ఫలితాల మీద ఆధారపడినదేనేమో! ఎవరో అన్నట్లు 'If there is no repression, there would be little literature'.

గుర్తింపు కాంక్షలు:
భగవత్‌ ప్రీతికోసమో, ప్రభువుల (తన అవసరాలు తీర్చేవారి) తృప్తి కోసమో, సమాజ సంస్కరణ కోసమో, తనను తాను తృప్తిపరచుకోవడం కోసమో లేదా కేవలం డబ్బుకోసమో కళాసృజన చేశామని చెప్పుకునేవారు కూడ 'గుర్తింపు' కోసం పాకులాడడం చూస్తూనే ఉన్నాం. ఇతరులకంటే సృజనాత్మక రంగాలలో కృషి చేసే వారికి గుర్తింపు కాంక్ష మరింత అధికంగా ఉంటుంది. నిష్కామ కర్మను బోధించే ఆధ్యాత్మిక తత్పరులకూ చోదకశక్తి గుర్తింపు కాంక్షేనేమో!

1. వస్తు నవ్యత వల్లనో, బలమైన వ్యక్తీకరణ వల్లనో యాదృచ్ఛికంగా వచ్చిన ఖ్యాతిని నిలుపుకునే ప్రయత్నం.
2. అధ్యయన, అభ్యాసాలు లేకపోయినా కాలక్షేపంకోసం కళాకారులుగా మారి, వచ్చిన కొద్దిపాటి గుర్తిం పుతో తృప్తి పడకుండా మరింత కీర్తిని ఆశించడం.
3. తాము గొప్పవిగా భావించే వాటిని లోకం గుర్తించకపోవడం.
4. వివిధ కళారంగాలలో కృషి చేస్తూ దేనిలోనూ పరిణతిని సాధించలేకపోవడం.
5. వివిధ కళాక్షేత్రాలలో కృషి చేస్తున్నప్పుడు తాను కోరుకున్న రంగంలో కీర్తి రాకపోవ డం.
6. కొన్ని సంవత్సరాలపాటు కళా సృజనకు దూరమై తిరిగి కొనసాగించదలచినప్పుడు ఆ రంగంలో వచ్చిన పరిణామాలను గుర్తించలేకపోవడం, గుర్తించినా తగిన ప్రతిభను ప్రదర్శించలేకపోవడం.
7. కళారంగంలో వచ్చిన కీర్తి దైనందిన జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడకపోవడం.
8. వృత్తికి ప్రవృత్తికి మధ్య నుండే మిత్ర శత్రు సంబంధాలను స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోవడం లేదా అంగీకరించలేకపోవడం- మొదలైనవి కళాకారులకు సంఘర్షణను, నిరాశను కలిగించే కారణాలుగా ఊహించవచ్చు.

కాని తన కళాఖండాన్ని కళాభిమానులకు అందుబాటులోకి తేవడం, విమర్శకుల మన్ననలు పొందడం కళాకారులకు ఎప్పటికీ సమస్యే. ఇది కళాకారుని లౌకిక వ్యవహార దక్షతకు పరీక్ష. 'The success of an artist may or may not be linked to his or her creativity or originality. It may more to do with their emotion IQ, social skills and connections in the right places' "మిథ్స్‌ ఆఫ్‌ క్రియేటివిటీ అండ్‌ జీనియస్‌' అనే వ్యాసంలో మోనిక్‌ లారెంట్‌ అనే విద్వాంసుడు వెల్లడించిన అభిప్రాయమూ పరిశీలించదగినదే. ఇక్కడ చర్చించిన అంశాలన్నీ సృజనాత్మకతకు ప్రాధాన్యమున్న రంగాలలో కృషి చేసే వారందరికీ వర్తిస్తాయి.

విశృంఖలత్వం:
తత్వ దర్శన ప్రస్థానంలో ప్రతి కళాకారుడూ ఐహిక, లౌకిక జీవితాలలోని విలువలు, ఆదర్శాలు రూపొందిన క్రమాన్ని, వాటిలోని వైరుధ్యాలను గ్రహిస్తాడు. ఆయా సిద్ధాంతాల, ఆదర్శాలలోని గుణదోషాలను, ఆచరణలోని సాఫల్య వైఫల్యాలను వెంటవెంటనే గ్రహించగలుగుతారు. దీనివల్ల కొందరు వ్యక్తిగత జీవితంలోని 'విశ్వాసాల'ను విడువకుండానే శూన్యవాద, నిరీశ్వరవాద ఛాయలలో పయనిస్తుంటారు.

కొందరు ఏ ఒక్క సిద్ధాంతానికో ఆదర్శానికో సుదీర్ఘకాలం కట్టుబడి ఉండకపోవడానికి ఇది కూడా కారణం కావచ్చు. కళాకారుల నిరంకుశ స్వభావానికి, స్వేచ్ఛాప్రీతికి, విశృంఖలత్వానికి కళలోని వ్యక్తి ప్రాధాన్యమూ, అనంత భావనాత్మక స్వేచ్ఛలూ మూలాలేమో! వీరికి సహజంగానే సౌందర్య దృష్టి ఎక్కువ. స్వసుఖ లక్షణాలు, స్వానురాగమూ, నవ్యతాప్రీతీ ఎక్కువే. సహజ మనః ప్రవృత్తికి భౌతిక, లౌకిక జీవితాలకు మధ్యనుండే శాశ్వత ఘర్షణను అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు.

గొప్ప కళాకారులైన సంప్రదాయవాదులు, నిష్ఠాగరిష్ఠులు కూడ కొన్ని జీవన పార్శ్వాలలో, అలవాట్లలో భౌతికవాదులలాగే వ్యవహరిస్తుంటారని తెలుసుకోవడానికి పెద్ద పరిశోధనలేమీ అక్కరలేదు. ఏమైనా నిలకడలేని వైవాహిక జీవితాలు, అనేక ప్రేమ వ్యవహారాలు, భగ్న ప్రేమలు, అసాధ్య ప్రేమలు, వివాహేతర సంబంధాలు, విశృంఖల లైంగిక ప్రవృత్తి కళాకారులలో ఎక్కువగా కనిపిస్తాయి. 'The Love affairs of many literary men make us almost conclude that they were more concerned about their loves than their art'. ఆల్బర్ట్‌ మోర్డెల్‌ (రోటిక్‌ మోటివ్‌ ఇన్‌ లిటరేచర్‌.

పుట.17) అన్నట్టు ప్రేమ వ్యవహారాలు కొన్ని సందర్భాలలో కళాసృజనకు భంగకరంగా మారడమూ ఉన్నది. ప్రేమలో పడడంతోనే ఎంత కొత్తవారైనా పాతబడక తప్పదని, పరస్పరం ప్రేమించుకున్నవారు ఇక ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాల్సింది ఏమీ మిగలనప్పుడు సాన్నిహిత్యం బలహీనపడుతుందని, కేవలం లైంగిక సంయోగం ద్వారా ఏర్పడిన సాన్నిహిత్యాలూ త్వరలోనే చెరిగిపోతాయని అప్పుడు తిరిగి కొత్త ప్రేమలను, సాన్నిహిత్యాలను కోరుకుంటారని ఎరిక్‌ఫ్రామ్‌ అంటాడు.

కళాకారులు-మద్యపానం:
'No poems can please for long or live that are written by water drinkers' అంటాడు రోమన్‌ కవి హోరేస్‌. స్వల్పంగా మద్యం సేవించినప్పుడు కలిగే ఏకాగ్రత, సంకోచరాహిత్యం నిర్మొహమాటత్వం మొదలైన లక్షణాలు కూడ కళాకారులను మద్యపాన ప్రలోభానికి గురి చేస్తుంటాయేమో! ఇలాంటి ఆలోచనలే మద్యపానం, కళాసృజన అవినాభావమైనవనే స్థితికి చేర్చి వ్యసనంగా మారుస్తుంటాయి. 'జబ్‌ భీ మయ్‌ఖానే సే హమ్‌ చలే సాథ్‌ లేకర్‌ సైకడోం ఆలమ్‌ చలే జిత్‌ నే గమ్‌ జాలిమ్‌ జమానే నే దియే దఫ్న్‌ కర్‌కే మయ్‌కదేమే హమ్‌ చలే' (మదిరాలయం నుంచి నేను బయటికి వచ్చినప్పుడు వందలాది విశ్వాలు నాతో సహయానం చేస్తాయి.

ఈ క్రూర ప్రపంచం ఇచ్చిన దుఃఖాలన్నిటినీ పూడ్చేసి మధుశాలలోకి ప్రవేశించాను) మద్యం కొన్నింటిని మరచిపోవడానికి ఎంతగా ఉపకరిస్తుందో, (పై షేర్లల్లో ఒక ఉర్దూ కవి చెప్పినట్లు) తనకు తెలిసీ తెలియకుండా అణచివేసిన గెలుపు ఓటములతో కూడిన అనేక ప్రపంచాలను గుర్తు చేసి అంతగా అశాంతిపాలు చేస్తుంది. చివరకు 'బే ఖుదీ మే భీ కరార్‌ ఆతా నహీఁ' అని స్వగతంలో రోదించేట్లు చేస్తుంది. నోబెల్‌ బహుమతి పొందిన ఏడుగురు అమెరికన్‌ రచయితలలో సింక్లెయిర్‌ లెవిస్‌, యూజినీ ఓనీల్‌, విలియం ఫాక్‌నర్‌, ఎర్నెస్ట్‌ హెమిం గ్వే, జాన్‌ స్టీన్‌బెక్‌ అనే అయిదుగురూ అధిక మద్యపానం వల్ల రోగాలపాలైనారట.

ఇతర రంగాలలో ఉన్నత స్థానాలకు చేరినవారికంటే కవులు, రచయితలు అతిగా మద్యం సేవిస్తున్నారని పరిశోధకులంటున్నారు. Gustafson and Norlander (1994) చేసిన అధ్యయనంలోనూ ఇదే తేలింది. సృజన కొనసాగుతున్న దశలోకంటే సృజన పూర్తి అయిన తర్వాత కళాకారులు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారని వీరన్నారు.

ఇరవైయవ శతాబ్దానికి చెందిన ప్రముఖ అమెరికన్‌ రచయితలలో 71 శాతం మంది అతిగా మద్యం సేవిస్తున్నారని, ఇతర రంగాలలోని నిపుణులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ శాతమని యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌సాస్‌ (Kansas) లో పనిచేసే ప్రొ.డొనాల్డ్‌ గుడ్‌విన్‌ అధ్యయనం చేసి తేల్చారు. ఇతరులతో పోలిస్తే లివర్‌కు సిరోసిస్‌ వ్యాధి సోకి మరణించేవారిలో రచయితలే ఎక్కువ శాతమని ఆయన అన్నాడు.

'Alcohlism is an epidemic among 20th century writers' అనే గుడ్‌విన్‌ మాటలు సమస్య తీవ్రతను తెలుపుతాయి. కవిత్వ సృజన మతిభ్రంశం (స్కిజోఫ్రేనియా)తో ముడిపడి ఉంటుందంటాడు రోథెన్‌ బెర్గ్‌ అనే పరిశోధకుడు. కొందరు శాస్త్రవేత్తలు సాహిత్యంలోని ఉద్వేగాలకు న్యూరోసిస్‌ లక్షణాలకు పోలిక ఉందంటున్నారు. కళాకారులలో 'మూడ్‌ డిజార్డర్‌' కూడా ఎక్కువే. కొంతకాలం చురుకుగా ఉత్సాహంగా కళా సృజన చేయడం, తీవ్రమైన శృంగార వాంఛతో 'మానిక్‌'గా ప్రవర్తించడం, మరికొంత కాలం దిగులుతో, నిరాశతో, బెంగతో, 'డిప్రెసివ్‌'గా ఉండడం కళాకారులలో సహజమే.

ఈ రెండు దశలు వెంటవెంట కాని, కొంత వ్యవధితో కాని పునరావృతమవుతుంటాయి. వీనిని మనో విజ్ఞాన శాస్త్ర పరిభాషలో 'బైపోలార్‌' అంటారు. ఉన్నతమైన బుద్ధిలో ఎంతోకొంత ఉన్మాదం కన్పించకుండా ఉండదని అరిస్టాటిల్‌ అన్నమాటలను 'శక్తివంతమైన సృజన చేసేవారు బహుధా విభక్తమైన తమ అంతరంగ సంఘర్షణతో బాధపడుతూ వైక్లబ్యాన్ని పొందుతార'నే ఆంతోనిస్టార్‌ అభిప్రాయంతో జోడించి చూసుకుంటే కళాకారుల వింత అలవాట్లకు, విపరీత ప్రవర్తనలకు కారణాలు తెలుస్తాయి.

మానసిక వైద్యురాలు నాన్సీ సి.యాండ్రీసన్‌ జరిపిన అధ్యయనంలో 80 శాతం మంది రచయితలు 'మానిక్‌ డిప్రెసివ్‌ ఇల్‌నెస్‌' లేదా 'మేజర్‌ డిప్రెషన్‌'కు గురిఅవుతున్నారని, ఇతరులు మాత్రం 30 శాతం మంది ఇలాంటి మానసిక సమస్యలతో బాధ పడుతున్నారని తేలింది. (అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రి- అక్టోబర్‌ 1987 సంచికలో తన అధ్యయన సారాంశాన్ని ప్రకటించింది) కళాకారుల ఆత్మ విధ్వంసక ప్రవృత్తి ఆత్మహననానికిదారి తీస్తుందనడానికి ఉదాహరణలెన్నో..

ప్రసిద్ధ చిత్రకారుడు విన్‌సెంట్‌ వాన్‌గో (1853-1890, తుపాకీతో కాల్చుకుని), జపాన్‌ కవి మిసావో ఫ్యూజి ముర (1886-1903), రష్యన్‌కవి మయకోవ్‌స్కీ (1893-1930, తుపాకీతో కాల్చుకుని), హంగెరీ కవి అటెల్లా జోసెఫ్‌ (1905- 1937, రైలు పట్టాలమీద తలపెట్టి), ఎర్నెస్ట్‌ హెమింగ్వే (1899- 1961, తుపాకీతో కాల్చుకుని), రుమేనియా కవి పాల్‌ సెలాన్‌ (1920-1970, సీన్‌ నదిలో దూకి), నోబెల్‌ గ్రహీత జపాన్‌ రచయిత యసునారి కవబాట; ఆర్థర్‌ కోస్టలర్‌ (1905-1983) మొదలైనవారు ఆత్మహత్య చేసుకున్నారు.

అమెరికన్‌ కవయిత్రి సారాటీస్‌డేల్‌ (1884-1993, నిద్రమాత్రలు మింగి), వర్జీనియా వుల్ఫ్‌ ( 1882- 1941), రష్యన్‌ కవయిత్రి మారిన స్వెతయేవ (1892-1941, ఉరిపోసుకుని), సిల్వియాప్లాత్‌ (1932- 1963); యాన్‌ సెక్స్‌టన్‌ (1928-1974), ఫ్రాన్స్‌ రచయిత్రి సారాకాఫ్‌ మాన్‌ (1934-1994) మొదలైన వారందరూ ఆత్మహత్యకు పాల్పడినవారే. ఆత్మ విధ్వంసక ప్రవృత్తికి మరో పార్శ్వం స్వీయ రచనా విధ్వంసం.

పరిశోధనలు-ఫలితాలు: యూనివర్శిటీ ఆఫ్‌ కెంటరీ మెడికల్‌ స్కూల్‌ లో మనోవిజ్ఞానశాస్త్ర ఆచార్యుడు ఆర్నాల్డ్‌ యం.లుడ్విగ్‌, ఆయన సహోద్యోగులు కలిసి ఇరవైయవ శతాబ్దానికి చెందిన వెయ్యిమంది ప్రముఖుల జీవిత చరిత్రలను పదేళ్లపాటు అధ్యయనం చేశారు. ఈ వెయ్యిమందిలో కళాకారులు, శాస్త్రవేత్తలు వివిధ రంగాలకు చెందిన సాంకేతిక నిపుణులూ ఉన్నారు.

కళాకారులు 72 శాతం, ఇతరులు 39 శాతం మానసిక రుగ్మతలకు గురయినారని లుడ్విగ్‌ బృందం పరిశోధనలో తేలింది. ఇతర రంగాలవారు మూడు నుంచి తొమ్మిది శాతం, వర్ధమాన కళాకారులు 29 నుండి 34 శాతం వరకు మానసిక అస్వస్థతకు గురువుతున్నారని, ఇతర రంగాలలోని మధ్య వయస్కులు 18 నుంచి 29 శాతం, కళాకారులు 59 నుంచి 77 శాతం మంది మానసిక అస్వస్థతకు గురవుతున్నారని లుడ్విగ్‌ బృందం పరిశోధనలో తేలిన మరో ముఖ్యాంశం.

వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధుల జీవితాలను అధ్యయనం చేసిన లుడ్‌విగ్‌ 'ది ప్రైస్‌ ఆఫ్‌ గ్రేట్‌నెస్‌ రిజాల్వింగ్‌ ద క్రియేటివిటీ అండ్‌ మ్యాడ్‌నెస్‌ కాంట్రవర్సీ' (1995) అనే గ్రంథం రాశాడు. రచయితల మద్యపాన వ్యసనానికి, మానసిక రుగ్మతలకు, ఆత్మహత్యలకు కారణాలను ఈ పుస్తకంలో లుడ్విగ్‌ సుదీర్ఘంగా చర్చించాడు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన మనో విజ్ఞాన శాస్త్ర అధ్యాపకురాలు, వైద్యురాలు కే రెడ్‌ ఫీల్‌ జామిసన్‌ 1980లలో 47 మంది ప్రముఖ బ్రిటిష్‌ కళాకారుల చేత సుదీర్ఘ ప్రశ్నపత్రాలకు జవాబులు రాయించి పరిశీలించింది.

ఈ 47 మందిలో 38 శాతం మంది డిప్రెషన్‌, బైపోలార్‌ డిజార్డర్‌ కు గురయిన వారుకాగా, ఎలక్ట్రో కన్‌వల్‌జివ్‌ థెరపీ లేదా సైకోట్రాపిక్‌ మెడికేషన్‌ అవసరమైనవారు 28 శాతం మంది ఉన్నారు. కవులు అల్పాయుష్కులా: ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైకియాట్రీ ఆఫ్‌ మ్యూనిచ్‌కి చెందిన డా.అడేల్‌జుడా 1927 నుంచి 1943 వరకు 5000 ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడట. 27 శాతం మంది కళాకారులు, 19 శాతం మంది శాస్త్రవేత్తలు న్యూరోసిస్‌, పర్సనాలిటీ డిజార్డర్‌కు గురయినారని, 50 శాతం కవులు సైకిక్‌ డిస్‌రప్‌షన్‌తో బాధపడుతున్నారని తేల్చాడు.

ఎర్నింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొ.జేమ్స్‌ కాఫ్‌మాన్‌, అమెరికా, చైనా, టర్కీ, తూర్పు యూరప్‌ దేశాలకు చెందిన 2000 మంది ప్రాచీన, ఆధునిక కవుల, రచయితల, జీవిత చరిత్రలను పరిశీలించాడు. నాటక రచయితల సగటు జీవితకాలం 63 సం.లు, నవలా రచయితల సగటు జీవితకాలం 66 సం.లు, కవుల సగటు జీవితకాలం 62 సం.లు సామాజిక శాస్త్రవేత్తల సగటు జీవితకాలం 73 సం.లు అని పేర్కొన్నాడు.

"Creative individuals,especially poets reported that their psychological and physiologcal states during periods of great creative productivity were very similar to those during a manic period. Poetic creativity especially has usually been linked with schizophrenia. This is in part because primary process cognition has often been thought to operate prominentaly in both schizophrenia and the composing poetry

Saturday, November 8, 2008

ప్రభుత్వమా? పెప్సీ కోలాలా?

పెప్సీ కోలాల్లో పురుగుమందులున్నాయంటే ఏదో ఖాన్ దాదాతో గ్లామర్ ప్రకటనలిచ్చి జనాల గొంతుల్లోకి విషం దింపినట్టు తియ్యతియ్యగా.
ప్రభుత్వ పథకాల్లో అవినీతి 90రూపాయలను నూటికి మింగేస్తుందంటే మరో వెయ్యి కోట్లు నజరానాగా ఇచ్చి ముసలి యువ తిలకునితో ప్రకటనలిచ్చి జనాల కొంపా గోడు తవ్వి పారేసి నెత్తిన ఉచిత గొడుగు, కింద ఉచిత చాపా కార్యక్రమానికి తియ్యతియ్యగా స్వీకారం.

Wednesday, November 5, 2008

పురంధరేశ్వరీ ఇస్తున్న గౌరవం నిలబెట్టుకో

అమ్మా పురంధరేశ్వరీ,

ఆ ఇంటి ఆడబిడ్డవయినందుకు, అభిమానులూ, బంధువులూ, నువ్వెన్నీ మాటలన్నా పల్లెత్తు మాటనకుండా అన్నగారిపై గౌరవాన్ని చూపుతున్నారు.

ఆ గౌరవాన్ని నిలుపుకోవాలంటే ప్రజా గర్జన చూసి ఇహనైనా కుటుంబ గౌరవం నిలిపే పనులు చెయ్యి.

వేరు తెలంగాణా వద్దు


Tuesday, November 4, 2008

రాజాధిరాజుకు మరో దెబ్బ

http://eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel16.htm

వేలం'వెర్రి కుదిరింది'ఆ రూ.956 కోట్లు చెల్లించలేంఅడ్వాన్సుల మేర భూమివ్వండి చాలుచేతులెత్తేసిన డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌కోకాపేట, బుద్వేలులలో భూమ్‌ ఢామ్‌అప్పుల వూబిలో హైమాహైదరాబాద్‌ - న్యూస్‌టుడేఅమెరికాలో మొదలై, సునామీలా ప్రపంచాన్ని చుట్టుముడుతున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌నూ తాకింది. ఎకరం యాభై కోట్లంటూ సినిమాల్లోకీ పాకిన కోకాపేట భూముల భూమ్‌ ఫట్‌ మంది. వందల కోట్ల రూపాయలు చిల్ల పెంకుల్లా వెదజల్లి, నగర శివార్లలో ఎకరాల కొద్దీ భూములు బుక్‌ చేసుకున్న డీఎల్‌ఎఫ్‌, యూనిటెక్‌ సంస్థలు మిగతా రూ.956 కోట్లు చెల్లించాల్సి వచ్చే సరికి చేతులెత్తేశాయి. ఇటీవల సంక్షోభంలో వాటి షేర్లు పాతాళానికి చేరి, మళ్లీ పుంజుకోకపోవడంతో నిధుల కొరత ఏర్పడింది. దాంతో తాము చెల్లించిన అడ్వాన్సులకు ఎంత భూమి వస్తే అంతే ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కాళ్ల బేరానికి వచ్చాయి. నిరుపేదల నుంచి భూములు లాక్కొని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టిన హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హైమా)కు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. హైమాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది భూమి అమ్మకాల లక్ష్యం రూ.4 వేల కోట్లు నిర్దేశించింది. భారీ లక్ష్యాన్ని చేరుకోలేక పోయిన హైమా బంగారం పండించే భూములున్నాయిలే అన్న ధైర్యంతో బ్యాంకుల నుంచి రూ.500 కోట్లు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ప్రభుత్వానికి ఇచ్చింది. ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టడమే పెద్ద సమస్యగా మారింది. భూముల ధరలు తగ్గించ లేని పరిస్థితుల్లో వేచి ఉండటం తప్ప దానికి మరో మార్గంలేదు.
డీఎల్‌ఎఫ్‌: అంతర్జాతీయ విమానాశ్రయానికి, సైబరాబాద్‌కు దగ్గర్లో అవుటర్‌ రింగ్‌రోడ్డుకు ఆనుకొని ఉన్న కోకాపేటలో హుడా(తర్వాత హైమాగా మారింది) 'గోల్డెన్‌ మైల్‌' పేరిట 100 ఎకరాలను గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం వేలం వేసింది. ఎకరం రూ.10 కోట్లు నిర్ణయించగా 25 ఎకరాలు అమ్ముడుపోయాయి. మిగిలిన 75 ఎకరాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ డీఎల్‌ఎఫ్‌కు కేటాయించింది. ఆ సంస్థ రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉండగా బయానా కింద రూ.385 కోట్లు చెల్లించింది. పన్నులు కలుపుకుని డీఎల్‌ఎఫ్‌ ఇంకా రూ.480 కోట్లు చెల్లించాల్సి ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో మాంద్యం ఏర్పడటంతో ఆ సంస్థ వెనక్కితగ్గింది. మూడు నెలల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా, పది నెలలు గడిచినా మిగతా మొత్తం చెల్లించలేదు. అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే చివరి నోటీసు జారీ చేశారు. మిగతా మొత్తం చెల్లించకపోతే కేటాయింపు రద్దు చేస్తామని, అడ్వాన్సుగా ఇచ్చింది తిరిగి ఇచ్చేది లేదని హెచ్చరించింది. దాంతో డీఎల్‌ఎఫ్‌ కదిలివచ్చింది. అడ్వాన్సు మొత్తానికి ఎంత భూమి వస్తుందో అంతే భూమిని తనకివ్వాలని మొరపెట్టుకుంది.
యూనిటెక్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్టార్‌ హోటళ్ల అవసరం ఉందని భావించిన ప్రభుత్వం సమీపంలోని బుద్వేలులో పర్యాటక సంస్థ నుంచి 80 ఎకరాలను, నిరుపేద రైతుల నుంచి అసైన్డ్‌ భూమి మరో 90 ఎకరాలను సేకరించింది. హుడాకు అప్పగించింది. ఇందులో 164 ఎకరాలు హుడా వేలం వేసింది. యూనిటెక్‌ సంస్థ ఎకరం రూ.4.01 కోట్ల చొప్పున దక్కించుకుంది. అడ్వాన్సుగా రూ.180 కోట్లు చెల్లించింది. ఒప్పందం ప్రకారం మిగిలిన రూ.476 కోట్లు మూడు వాయిదాల్లో చెల్లించాలి. ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ పతనంలో భాగంగా ఆ సంస్థ షేర్లు బాగా పడిపోయాయి. దాంతో ఆ సంస్థకూ నిధుల లభ్యత సమస్య ఏర్పడింది. పలుమార్లు అధికారులు సంప్రదింపులు జరిపినా ఆ సంస్థ బుద్వేలు భూముల బాకీ చెల్లించలేక పోయింది. చివరకు ఈ సంస్థ కూడా రూ.180 కోట్లకు ఎంత భూమి వస్తుందో అంతే తమకు ఇవ్వాలని మొర పెట్టుకుంది. కార్పొరేట్‌ సంస్థలు భారీ ధరలు పెట్టి హైదరాబాద్‌లో భూములు కొనడంతోనే రాజధానిలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటాయి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఈ పాపంలో సామాజిక బాధ్యతను మరచి తగని పోటీని సృష్టించిన హైమాదే ప్రధాన పాత్ర. ఇప్పుడీ సంస్థలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. మరి రేట్లు దిగిరాలేదేం? అనేది సామాన్యుడి ప్రశ్న. మిగతా రియల్‌ సంస్థలూ కొన్న రేటుకన్నా తక్కువకు అమ్మలేక పళ్ల బిగువున ఆపడమేనని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది

ఒరేయ్ ఉండవల్లీ పురుగులు పట్టిపోతావురరేయ్

ఒరేయ్ ఉండవల్లీ పురుగులు పట్టిపోతావురరేయ్

మీ రాజుగారు చేసే వేల, లక్షల ఎకరాల ఆక్రమణ కనపడట్లేదారా

కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్టు ఓ 10 ఎకరాల కుంబకోనం తీశావుగా

ఏలాగూ ఓడిపోతానని ఈ సారి పోటీయే చెయ్యకుండా పారిపొయిన పిరికిపంద

బాపనోడిగ చెడ పుట్టావుగదరా

ఎన్నాల్లు ఎగురుతావో ఎగురు,
చివరకు ఎలుగూ పురుగులు పట్టి పోతావుగా

Monday, November 3, 2008

స్రవంతి 1

1. ఇన్ స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల మరో లాభం - హిందీ టైపు విడిగా నేర్చుకో అక్కరలేదు. (బహుశా మిగిలిన భారతీయ భాషలు కూడా అనుకుంటాను)
(इन् स्क्रिप्ट् नेर्चुकोवडं वल्ल मरो लाभं - हिंदी टैपु विडिगा नेर्चुको अक्करलेदु )
2. సాక్షి వాడి వార్తలు చూస్తుంటే కరపత్రం అనే మాట కూడా సరిపోదేమో అనిపిస్తుంది. (అబద్దాలు, అబద్దాలు, అబద్దాలు - అర్థ సత్యాలు కూడా కావాయ )
3. రాధిక బ్లాగుకు నేనో కొత్త పంకా , ఎంత బాగున్నాయి ఆ కవితలు.
4. ఈనాడు వ్యాసం తరువాత కొత్త బ్లాగులు పెరిగినట్లున్నాయి. కానీ వాసి పెరిగినట్లు లేదు.
5. నేను సమైక్య వాదిని.
5అ. ఆత్మ గౌరవం - ఒకరిచ్చేదేముంది ? ఆలా చూస్తే మాల మాదిగ ఎప్పుడో దేశాన్ని ముక్కలు చెయ్యాలి.
5ఆ. వెనకబాటు తనం - విడిపోతే మాత్రం ఎలా అభివృద్ది చెందుతారు ? వెయిట్, వెయిట్ - వాటిల్లే కలిసి ఉండి చెయ్యలేనివి ఏమిటి ?
5ఇ. మోసం చెయ్యడం - మోస పొయ్యే వారుంటే మసం చేసే వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇయ్యాల ఆంధ్రోడు కొన్నది రేపు ఏ కేకే కొడుకో కొంటాడు.
5 ఈ . రేపు దేశం ముక్కలయితే ? ఈ తమిలోల్లల, హిందీ వాల్లల నేగ్గుకు రావాలంటే కలిసి ఉండటమే మంచిది.

(ఇంకా ఉంది )

Thursday, October 30, 2008

ఆహార నిద్రా మైథునాల్లాగే కవిత్వామూ

రోజులు బల్లపరుపుగా, నిస్సారంగా గడిచిపోతుంటాయి, ఆహార, నిద్రా, మైథున క్రియల్లో. ఎప్పుడో ఒకప్పుడు మనస్సులో విస్ఫోటనం జరుగుతుంది. సంవేదనలు సునిశితమౌతాయి. అనుభూతులు అతి సున్నితమౌతాయి. అప్పుడు కవిత్వం ఉద్భవిస్తుంది. ఐతే, నాకు కవిత్వం సద్యోగర్భం కాదు. అది పిండదశలో నవ మాసాలూ పెరగవలసిందే. నాకు కవిత్వ భావస్ఫురణ మాత్రం సంభోగాంత రేతస్ఖలనం వంటి అనివార్య, ఆనందదాయక, పతాక స్థితి.

మా హైస్కూల్ రోజుల్లో శ్రీపాద నరసింహమూర్తి అనే స్నేహితుడుండేవాడు. మా లెక్కల మాష్టారు బుచ్చన్న పంతులుగారి అబ్బాయితను. చాలా చురుకైనవాడు. మా ఇద్దర్నీ దగ్గిరగా చేర్చిందేమిటంటే పుస్తకాల పిచ్చి. కాకినాడలో ఇంటర్ పూర్తయాక ఇతను హైదరాబాద్ వెళ్లి నిజాం కాలేజ్‌లో చేరాడు. సెలవలకి అప్పుడప్పుడు కాకినాడ వస్తుండేవాడు. హైదరాబాద్‌లో తన కొత్త స్నేహితుల గురించీ, తను చదివిన కొత్త పుస్తకాల గురించీ ఆసక్తికరంగా చెబుతుండేవాడు. కొత్త స్నేహితుల్లో తన హీరో రాయప్రోలు సుబ్బారావుగారి అబ్బాయి శ్రీనివాస్. తమిద్దరూ కలిసి కనిపెట్టిన కొత్త పుస్తకాలూ, వాటిల్లో విషయాలూ చెబుతుంటే, నాకు ఆశ్చర్యంతో కళ్లు విప్పారేవి. ఒ్చఝ్ఛట ఒౌడఛ్ఛి, ఖీ.ఖి.ఉజూజ్టీౌ, గి.ఏ.అఠఛ్ఛీn, ఔౌఠజీట క్చఛి ూ్ఛజీఛ్ఛి, ఇజిజీటట్టౌఞజ్ఛిట ఐటజ్ఛిటఠీౌౌఛీ, ఈడజ్చూn ఖీజిౌఝ్చట నే నెన్నడూ వినని పేర్లు చెబుతుంటే, ఇంత సాహిత్య సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న వీరి అదృష్టానికి అసూయపడేవాణ్ణి.

ఐతే, శ్రీనివాస్ రాయప్రోల్ ని చూసే అవకాశం అప్పుడు నాకు కలగలేదు. కాలేజి చదువు పూర్తి కాగానే వీరిద్దరూ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగు చదువుకోసమని వెళ్లారు. అమెరికాలో చదువుతుండగా శ్రీనివాస్‌కి ఉ.ఉ.ఇఠఝఝజీnజట,గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూ జ్చీఝట వంటి ప్రముఖ కవులతో పరిచయం కలిగింది. ముఖ్యంగా విలియమ్స్‌తో దీర్ఘకాలం ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. శ్రీనివాస్ పద్యా లు అ్టజ్చూn్టజీఛి కౌn్టజిజూడ వంటి ఉత్తమ తరగతి పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. నరసింహూర్తి కూడా ఇజిటజీట్టౌఞజ్ఛిట ఖిటజీఞ్చఛ్చీ పేరుతో కథలు రాయటం ప్రారంభించాడు. చదువు పూర్తయ్యాక వీరిద్దరూ తిరిగొచ్చి ూజ్డ్చీఝ'ట ఖ్ఛిటఠిజీఛ్ఛి లో ప్రవేశించారు.

ఐతే, దురదృష్టవశాత్తు అనతికాలంలోనే, 1954లో, నరసింహమూర్తి కాలం చేశాడు. శ్రీనివాస్ సికందరాబాద్ నించి అతి వ్యయప్రయాసలతో ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట అనే సాహిత్య పత్రికను కొంతకాలం నడిపారు. ఇందులో ఒ్చఝ్ఛట ్కఠటఛీడ, ఏ్ఛnటడ కజీజూజ్ఛూట, గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట వంటి ప్రముఖ అమెరికన్ రచయితలు తమ రచనలు ప్రచురించారు. ఖఠ్ఛట్ట, ఐజూజూఠట్టట్చ్ట్ఛఛీ గ్ఛ్ఛిజుజూడ మొదలైన పత్రికల్లో కూడా అప్పుడప్పుడు శ్రీనివాస్ రచనలు చూస్తుండేవాణ్ణి. 1968లో ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట అనే కవితా సంకలనం, 1972లో క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి అనే సంకలనమూ కలకత్తాలోని గిటజ్ట్ఛీటట' గిౌటజుటజిౌఞ వారు ప్రచురించారు.

1974 వరకు నేను శ్రీనివాస్‌ని కలవటం జరగలేదు. మా మిత్రులు గిర్గ్‌లానీ మొదలైనవాళ్లూ, నేనూ కలిసి అn అn్టజిౌజూౌజడ ౌజ ఖ్ఛీజూఠజఠఉnజజూజీటజి ్కౌ్ఛ్టటడ అనే అనువాద కవితల సంకలనం వేసి, ఆవిష్కరణకి హైదరాబాద్ పట్టుకెళ్లాం. అప్పుడు పాతికేళ్లుగా వినికిడి మాత్రగా ఎరిగున్న నా అభిమాన కవి శ్రీనివాస్ రాయప్రోల్‌ని కలవటం జరిగింది! రోజులు బల్లపరుపుగా, నిస్సారంగా గడిచిపోతుంటాయి, ఆహార, నిద్రా, మైథున క్రియల్లో. ఐతే, ఎప్పుడో ఒకప్పుడు మనస్సులో విస్ఫోటనం జరుగుతుంది. సంవేదనలు సునిశితమౌతాయి. అనుభూతులు అతి సున్నితమౌతాయి. అప్పుడు కవిత్వం ఉద్భవిస్తుంది. ఐతే, నాకు కవిత్వం సద్యోగర్భం కాదు. అది పిండదశలో నవ మాసాలూ పెరగవలసిందే. ఐతే, నాకు కవిత్వ భావస్ఫురణ మాత్రం సంభోగాంత రేతస్ఖలనం వంటి అనివార్య, ఆనందదాయక, పతాక స్థితి అంటారు శ్రీనివాస్. కవిత్వం ఎందుకు రాస్తాను? నేను చెప్పదలచుకున్న దేదో ఈ మాటలు చెబుతాయని. ఎవరినో ఉద్ధరించటానికి కాదు. రాయటం నాకు ఆవశ్యకం.

ఆహార, నిద్రా, మైథునా లెలా ఆవశ్యకాలో, అలాగే అంటా రీయన. మన సాధారణ జీవితాలకి మెరుగుపెట్టే దైనందిన అనుభవాల గురించే శ్రీనివాస్ రాశారు: సంసారం, భార్యా, పిల్లలూ, తల్లితండ్రులూ, వాళ్ల వృద్ధాప్యమూ, స్నేహితులూ, ఆడెన్ వంటి అభిమాన కవులూ, తనకు నచ్చిన చిత్రకారులూ (పికాసో, జామినీ రాయ్), మధ్య వయస్కంతా పైబడుతున్న యేళ్లూ, చిన్నప్పటి జ్ఞాపకాలూ, పెద్దప్పటి దిగుళ్లూ- ఇంతకన్నా రాయటాని కేముంది? ఇదే కదా జీవితం. వెతికే వాడికి ఇందులోనే వజ్రాలు దొరుకుతాయి. ప్రసిద్ధ ఇండో - ఏంగ్లియన్ కవి ఈౌఝ కౌట్చ్ఛట ఏడాది క్రితం ఏజీnఛీఠ పేపర్‌లో శ్రీనివాస్ గురించి అద్భుతమైన ప్రశంస రాశాడు.

ఈయన చేసిన పొరపాటల్లా 20 యేళ్లు ముందుగా పుట్టటమూ, ఇంగ్లీషు సాహిత్య కేంద్రాలకు మారుమూల ప్రాంతమైన సికందరాబాద్‌ను వదలకపోవటమూనూ, ప్రస్తుతం ఇంగ్లీషులో రాస్తున్న భారతీయ కవులకు (వీళ్లని ఇండో-ఆంగ్లియన్ లంటారు) ప్రాచుర్యం లభిస్తోంది. ఇండో-ఆంగ్లియన్ రచన ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. మరో సంగతేమిటంటే, ఇంగ్లీషు కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలంటే, సికందరాబాద్ వంటి మారుమూల పట్టణాల్ని వదిలి ఏ ముంబాయో, ఢిల్లీయో చేరుకోవాలి. (తెలుగు కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్లు ఏ కాకినాడనో పట్టుకు కూచుంటే ఎలా? ఏక్షనంతా హైదరాబాద్‌లో వుంది!) ఆంధ్రప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి, రిటైరై, సికందరాబాద్‌లో ఉంటున్నారు శ్రీనివాస్. ఇప్పుడు వయస్సు 73 ఏళ్లు. ఈయన కృతులన్నీ కలిపి 1995లో 'ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట ౌజ ఖిటజీnజీఠ్చిట ఖ్చడ్చఞటౌజూ' అని ప్రచురించారు కలకత్తాలోని గిటజ్ట్ఛీటట గిౌటజుటజిౌఞ వారు.

- ఇస్మాయిల్ 18.3.1998
(ఇది ఇస్మాయిల్ అముద్రిత రచన. రాయప్రోల్ జయంతి అక్టోబరు 25)

శ్రీనివాస్ రాయప్రోలు శ్రీనివాస్ రాయప్రోలు
(1925-1998) సికిందరాబాద్‌లో జన్మించారు. చదువూ స్వతంత్ర భావాలకు అమెరికా కారణమైనా, ఐదేళ్లపాటు (1956-61) నడిపిన ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట సాహిత్య పత్రికలో అమెరికన్ కవిత్వంలోని వెర్రిపోకడలను విమర్శించడానికి వెనుకాడలేదు. ఆ కారణంగానే ఆయన గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట లాంటి గొప్ప కవుల సాన్నిహిత్యం పొందగలిగారు.

ఆయన ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట (1968), క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి ్చnఛీ ్ౖటజ్ఛిట ్కౌ్ఛఝట (1974), ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట (1995) కవిత్వ పుస్తకాలను వెలువరించారు. చివరి పుస్తకంలో ముందుమాటలో.. తనను ఆకట్టుకునేది ఉట్టి కళా చాతుర్యం కాదు.. ఆలోచనల్లో అభివ్యక్తిలో పూర్తి నిజాయితీ.. ఏ కోశాన నటన లేకపోవడం అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒ్చఝ్ఛట గిటజీజజ్టి లాంటి కవుల కోవకు చెందినా ఇందులో తను విఫలమయ్యానని భావించారు. చివరికి ఆయన సికింద్రాబాద్‌లోనే కనుమూశారు. -ఊ్ఖఔఇఖ్ఖక, ఇ్చఝఛటజీఛీజ్ఛ పత్రిక, భారతీయ కవిత్వ విశేష సంచిక నుండిశ్రీనివాస్ రాయప్రోలు శ్రీనివాస్ రాయప్రోలు (1925-1998) సికిందరాబాద్‌లో జన్మించారు.

చదువూ స్వతంత్ర భావాలకు అమెరికా కారణమైనా, ఐదేళ్లపాటు (1956-61) నడిపిన ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట సాహిత్య పత్రికలో అమెరికన్ కవిత్వంలోని వెర్రిపోకడలను విమర్శించడానికి వెనుకాడలేదు. ఆ కారణంగానే ఆయన గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట లాంటి గొప్ప కవుల సాన్నిహిత్యం పొందగలిగారు. ఆయన ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట (1968), క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి ్చnఛీ ్ౖటజ్ఛిట ్కౌ్ఛఝట (1974), ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట (1995) కవిత్వ పుస్తకాలను వెలువరించారు. చివరి పుస్తకంలో ముందుమాటలో.. తనను ఆకట్టుకునేది ఉట్టి కళా చాతుర్యం కాదు.. ఆలోచనల్లో అభివ్యక్తిలో పూర్తి నిజాయితీ.. ఏ కోశాన నటన లేకపోవడం అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒ్చఝ్ఛట గిటజీజజ్టి లాంటి కవుల కోవకు చెందినా ఇందులో తను విఫలమయ్యానని భావించారు. చివరికి ఆయన సికింద్రాబాద్‌లోనే కనుమూశారు.

ఊ్ఖఔఇఖ్ఖక, ఇ్చఝఛటజీఛీజ్ఛ పత్రిక, భారతీయ కవిత్వ విశేష సంచిక నుండి

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.


vividha : http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/oct/27vividha1

వారాంతం పధకాలు

ప్రతి వారాంతం ఏదేదో చేద్దామని రకరకాల పథకాలు, కానీ చివరకు జరిగేది ఒకటే

నిద్రపోవడం !

Wednesday, October 29, 2008

దీపావళి హైదరాబాదులో ,,, విదేశీయురాలి బ్లాగు

http://www.thefluegges.com/?p=501

తప్పకుండా చదవాలి.

బ్లాగుల్లో నీతు బోదనలేక్కువ అయినాయి.

కొంత మంది ముసలి వాళ్లు (శరీరంలోనో, మనసులోనో మనకు తెలీదు కనుక ముసలి బ్లాగులు అనుకుందాం)

వీరికి హిట్టయిన సినిమాలు నచ్చవు. అమోఘమయిన తమ వాదనా పటిమతో హిట్టయిన సినిమాలన్నీ ఎలా చెత్త సినిమాలో నిరూపిస్తారు.

తాము గీసిన గిరిలోనే ముందటి తరాలన్నీ ఉండాలనుకుంటారు, పాపం


మాకూ ఓ యూత్ కూడలి కావాలి.

అక్కడీ కుళ్లిన కృశించిన , ముసలి ముతక బ్లాగులకు ప్రవేశం బాన్.

కొత్త పాళీ జన్మ దిన శుభాకాంక్షలు.

కొత్త పాళీ జన్మ దిన శుభాకాంక్షలు.

జ్ఞానము

తెలవని వారికి వివరము
తెలిసిన వారికి జ్ఞానము
తెలిసీ తెలియని వారికి అజ్ఞానము.

Sunday, October 26, 2008

ఆముక్తమాల్యద: 2-2 : ఏ వీట సతుల పాలిండ్లపై గంబూర

సీసం

ఏ వీట సతుల పాలిండ్లపై గంబూర
నవహారముల చిప్పకవుచు మాన్చు,
మలయజం బే వీట దొలు చెక్క డులిచి మే
డల కిడ్డ మిగులు భూములకు డిగ్గు,
గలచు నే వీడి సింహళ గజంబుల గాలి
చైత్ర వేళ నుదగ్దశా గజంబు,
దాల్తు రేవూడి ప్రాక్తన భూప నిర్మాల్య
మరకతంబులు పెఱ ధరణీపతులు,

తే

కపివర నియుక్త గిరి సదృగ్గహన నిలయ
గాత్రగాహిత కనక ముక్తా కవాట
గోపురావేదితోచ్చతాక్షోభ్య వప్ర
దనరు దక్షిణ మధుర సాంద్రద్రుమధుర

Wednesday, October 22, 2008

బెదిరింపులకా సెటిలర్స్ ఫ్రంట్

సాక్షి నుండి.

రాజశేఖర రెడ్డి కుల రాజకీయాలు

మొన్నీమద్య గౌడ కుల పెద్దలు
ఈ రోజు స్వర్ణకారులు

ఇలా రోజుకో కులాన్ని పిలిపించుకోటం, అదీ ఇదీ చెప్పటం, చివరకు డైరక్టుగానో ఇండైరెక్టుగానో వోటు బ్యాంకు సృష్టించుకోవాలని చూడటం.

కులమా నీ చావెప్పుడే?

కుల దుర్వినియోగమా నీ చావెప్పుడేఁ?

త్తెటైపింగ్

మా వాడొకడు బెంగాలీ నేర్చుకుంటున్నాడు, పదం పదం కూడబలుక్కోని ప్రాక్టీస్ చేస్తుంటే నవ్వుకున్నా.

ఇప్పుడు తెలుగులో నా టైపింగ్ కూడా అలాగే ఉంది. అక్షరం అక్షరం కూడబలుక్కోని వ్రాయాల్సి వస్తుంది. దానితో టపాలు చిన్నవి అవుతున్నాయి.

Wednesday, October 15, 2008

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్కమెరిగిన మహా నిత్యుడె ఘనుడు. 3

వేదములు చదివియును విముఖుడై హరి భక్తి ఆదరించని సోమయాజికంటే
ఏదియునులేని కులహీనుడైనను విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు.

పరమమగు వేదాంతపఠనదొరకియు సదా హరి భక్తిలేని సన్యాసి కంటే
సరవిమాలిన అంత్యజాతి కులజుడైన అరసీ విష్ణుని వెతకూ ఆతనే ఘనుడు.

వినియునూ చదివియునూ శ్రీవిభుని దాసుడుగాక తనవు వేపుచునుండు తపసికంటే
ఎనలేని శ్రీవేంకటేశు ప్రసాదాన్నమూ అనుభవించిన ఆతడప్పుడే ఘనుడు.

--అన్నమయ్య

Tuesday, October 14, 2008

పర్నశాల వీడదో టైపు

వీడు అతివాదుల్లో మితవాది, మితవాదుల్లో అతివాది.
వీడు పట్టుకున్న కుందేటికి ఒక్కటే కాలు, కాదు మూడని ఎవడన్నా కామెంటాడో ఇహ అంతే సంగతులు.

అడ్డంగా నిలువుగా వాదించడంలో దిట్ట, తిమ్మిని బమ్మి , బమ్మిని తిమ్మి చెయ్యడంలో ఆరితేరినవాడు.

వీడు వాదించడం కూడా అలక్సాండర్ యుద్దం చేసినట్టు బలహీన కామెంట్లపై దాడి చేస్తాడు. ఎవరన్నా నాలుగు మంచి ముక్కలు చెపితే అవి ఉన్నట్టు కూడా పట్టించుకోడు.

అన్నింటికంటే పెద్ద సమస్య తను ఎల్లప్పుడూ కరక్టే అనుకుంటాడు. తన అభిప్రాయం మార్చాలంటే దేవుడే దిగి రావాలనుకుంటాడు, అప్పుడు కూడా మార్చుకోడేమో. మరో పెద్ద సమస్య ఎదుటి వాడు ఎప్పుడూ తప్పే అనుకుంటాడు.

యూనీకోడ్ ఇప్పుడు పెద్దన్న

గూగుల్ వాడి ఈ టపా చూడండి http://googleblog.blogspot.com/2008/05/moving-to-unicode-51.html

ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువగా వాడే ఎన్కోడింగ్ యూనీకోడ్ !

దళితులు బాగుపడాలంటే

దళితులు బాగుపడాలంటే, అవినీతి నిర్మూలిస్తే సరిపోతుంది.

అప్పుడు పనులు రాజ్యాంగం ప్రకారం అవుతాయి. దళితులకు దక్కవలసింది దక్కుతుంది.

ఉదాహరణకు గవర్నమెంటు వాడు దీపం పథకం అనో మరేదో ప్రకటించాడనుకుందాం, కేవలం అవినీతిని ఆయుధంగా చేసుకొని అర్హులు కానివారు కూడా లబ్ది పొందుతున్నారు.

Monday, October 13, 2008

అనిశముదలచరో

అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబలం

హరి నిజనిలయం అహోబలం
హర విరించి నుత మహోబలం
అరుణమణిశిఖర మహోబలం
అరి దైత్యహరణ మహోబలం

అతిశయ శుభదం అహోబలం
అతులమనోహర మహోబలం
హత దరితచయం అహోబలం
యతిమత సిద్దం అహోబలం

అగు శ్రీవేంకట మహోబలం
అగమ్యమసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకులరాజం అహోబలం

అమెరికా ప్రస్తుత సంక్షోభం భారతదేశంలో గుప్తుల కాలం

అమెరికా ప్రస్తత సంక్షోభం చూస్తంటే నాకు గుప్తుల నాటి భారత దేశం గుర్తు వస్తంది.

అదెలాగంటారా?

ఇప్పడు ఆర్థిక సంక్షోభం పుణ్యమా అని గ్లోబలైజేషన్ వ్యతిరోకులకు పండుగే పండుగ. స్వేచ్చా ప్రియుల నోల్లు నొక్కి దేశాన్ని ఐరన్ కర్టన్ వైపు నడిపించటానికి బంగారపు అవకాశం.

గుప్తుల కాలానికి ముందు దేశం ముఖ్యంగా ఉత్తర దేశం గ్లోబల్ మార్కెట్ లో భాగంగా ఉండేది, అలక్షాండర్ దండయత్ర వల్ల వచ్చిన మార్పుల్లో ఇదొకటి. కాని అకస్మాత్తుగా దేశంపై ఐరన్ కర్టన్ వచ్చింది.
సాంస్కృతంగా, ఆర్థికంగా అప్పటి వరకూ సాగిన రవాణా చాలా వరకూ ఆగిపొయింది. చివరకు నౌకా రవాణా కూడా నిషేదించారు. యవ్వనులు మొన్నగు వారు విలన్లు అయ్యారు.

దేశాన్ని మొత్తన్ని ఇలా ఎలా చెయ్యగలిగారబ్బా అని అనుకునేవాన్ని, బహుశా అప్పుడు కూడా ఇలాగే వచ్చిన పెద్ద సమస్య నుండి బయటపడటానికి కఠిన నిర్ణయాలు తీసుకొని ఉంటారేమో!

నిలువు దోపిడీ

తిరుమల దేవాలయంలో కొలువైన వేంగండస్వామి వారికి నిలువు దోపిడీ అని ఓ మొక్కు ఉంది.

ఈ మొక్కు అతి తీవ్రమైన కష్టాలపాలైనప్పుడు మొక్కుకుంటారు.

ఇలా మొక్కు మొక్కుకున్నవారు , కోరిక తీరిన తరువాత ఒంటి మీద నగలన్నీ , బట్టలతో సహా హుండీలో వేసి,

ఏడు కొండలవాడా వేంకటరమణా గోవిందా అని ఇంటికి వస్తారు.

కొంత మంది తమ నగలకు సరిపోను నగదు కూడా బదులుగా హుండీలో వేసి నగలు ఇంటికి తెచ్చుకుంటారు.

నాకు తెలిసిన వారు కొడుకు ప్రాణాన్నీ, భర్త ప్రాణాన్నీ ఆసుపత్రిలో ఇలా కాపాడుకున్నారు.

లార్డ్ వెంకటేశ్ జిందాబాద్.

Tuesday, October 7, 2008

....

నన్ను నేను మోసం చేసుకుంటూ
నిన్ను నేను మోసం చేస్తూ
నువ్వు నన్ను మోసం చేస్తూ
నిన్ను నువ్వు మోసం చేస్తూ
నా కోసం నువ్వు అబద్దాలాడుతూ
నీ కోసం నేను అబద్దాలాడుతూ
భలే సాగుతున్నాం
ఈ ప్రయాణంలో
తరువాతి మజిలీ ఏమిటో మరి.

దసరా శుభాకాంక్షలు.

ఈ దసరా మీకు సకలైశ్వర్యాలూ, సకల శుభాలూ, సకల సంతోషాలు ప్రసాదించాలనీ
ఇ దసరా మీకు త్రి పీడలు కలిగించాలనీ,
మంచి బుద్దినీ, సాటివారిపై ప్రేమనూ కలిగించాలనీ,
దేశం శాంతి సౌభాగ్యాలతో తుల తూగాలనీ
.....

ఇంకా ఈనాడే నంబర్ వన్నా?

ఎప్పుడు 10 తరువాత కొందామన్నా ఈనాడు దొరకటంలేదు. అదే సాక్షి , ఆంధ్ర జ్యోతి, ... అయితే దిగాలుగా అలా పాన్ షాపుల ముందు వేలాడి కొనే వాల్లు ఉన్నారా అని ఎదురుచూస్తున్నట్టు ఉంటాయి.
ఈనాడు వాడు తక్కువ పేపర్లు పంపుతున్నాడా? లేక ప్రజలు ఇంకా అదే కొంటున్నారా?
సాక్షి హిట్టా? ప్లాపా?
అసలీ పేపర్ల అమ్మకాలు మనకి తెలిసే మార్గం ఏమన్నా ఉందా?

తెలుగు సినిమా తన సామాజిక భాద్యత నుండి తప్పుకుందా?

రైతుల ఆత్మ హత్యలు
సెజ్ లు భూ పోరాటాలు
నేత కార్మికుల ఆత్మ హత్యలు
ఇలా పలు విషయాలు రాష్ట్ర ప్రజానికాన్ని బాదిస్తున్నా, కనీసం ఒక్క సినిమా కూడా ఒక్కటంటే ఒక్క సామాజిక అంశంపై కూడా తియ్యలేదు.
అన్నిటికంటే దారుణ విషయం ఈవీవీ ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకున్న రైతు నుండి కూడా కామెడీ పిండటం.
ఎంత మంచి సినిమాలు తియ్యవచ్చు, ఎంత ధైర్యం కల్గించవచ్చు, ఎంత మార్పు తీసుకు రావచ్చు.
నారాయణ మూర్తి లాంటోల్లు మల్లా కావాలి.

Monday, October 6, 2008

కిరస్తానీ దాడులకు మీడియా మరీ ఎక్కువ కవరేజ్ ఇస్తుంది.

చేసే పనేదో ప్రజాస్వామ్యయుతంగా చేసుకోకుండా ఈ దాడులేమిటో, చెదురు మదురుగా ఇలాంటి సంఘటనలు జరిగినా వాటిని ఇన్ని రోజుల పాటు అదుపు చెయ్యకపోడమేమిటో,
ఇవన్నీ పక్కన పెడితే, కిరస్తానీ మీడియా గోరంతలను కొండంతలు చేస్తూ , రూపాయ తీసుకొని వంద రూపాయల యాక్షన్ చేసే సపోర్టింగ్ యాక్టర్లా ప్రవర్తిస్తుంది. ఇతర అన్ని విషయాల గురించి ఇంత యాగీ చెయ్యదేమిటో? అదీ మీడియాలో కేవ్లం ఒక వర్గమే!
అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విస్యం ఏమిటంటే ఈ హిందూ వాడు ఇన్నాల్లూ ముస్లిం సపోర్టే అనుకున్నాను కానీ ఇప్పుడు పూర్తి కిరస్తానీ సపోర్ట్ గా మారాడు. రోజూ రెండు పేజీలు ఈ వార్తకు కేటాయించాలా?
అంటే అన్నామంటారు కానీ ఓ సారి ఫ్లాష్ బాక్ కి యెల్లి గోవాలో ఏం జరిగిందో http://en.wikipedia.org/wiki/Goa_Inquisition చూడాలి.
ఇంకో ఆది శంకరాచార్యుని కోసం ఎదురు చూడాలా? ఆ పనేదో మన చేతిలో ఉన్నప్పుడే సామ దాన భేద దండోపాయాలుపయోగించి చేసెయ్యక.
అన్నట్టూ మేధావులను వాదించుకోనివ్వండి వాల్లని ఎం అనొద్దు, ఎందుకంటే వాదించడం మినహా వాల్లేమి చెయ్యరు, కనీసం ఆకలితో ఉన్నవాడికి ఒక మెతుకు కూడా ఇవ్వరు. ఆకలి ఎలా పోగొట్టాలి అని నాలుగైదు బ్లాగుల నిండా వాదించుకుంటం మినహా.

Sunday, October 5, 2008

ఇదో చెత్త చినెమ. ఛాలా సార్లు బోర్ కొట్టింది. ఏదో వ్రాశారు, ఏదో తీశారు. హీరోకి ఓ కారక్టర్ లేదు, హీరోయిన్లకు ఎలాగూ ఉండదు అనుకోండి. కారక్టరు లేదు అంటే నా ఉద్దేశ్యం హీరో మంచి వాడు కాదు అని కాదు చెడ్డవాడు అయినాగానీ ఓ క్లారిటీ ఉండాలి కదా, హీరోకి అది లేదు.
సరే ఫక్తు కమర్షియల్ సినిమా కదా కనీసం ఎంటర్ టైన్ మెంట్ అన్నా ఉంటుందేమో అనుకుంటారా? అదీ బొత్తీఅ లేదు అను క్షణం బోరింగ్. పాటలు టూ వర్స్. ఉల్లాసంతా ఉత్సాహంగా, రెయిన్ బో, వంటి యూత్ సినిమాల ముందు ఇవి పూర్తిగా దిగదుడుపే.

The one step

On that day
That one step
Changed my life altogether
It was never like before after that step.

Still I am wondering some times
Was I good or am I good?

But, I don't have time machine like my characters do
Alas!

Friday, October 3, 2008

నీతులన్నీ సినిమాల్లోనే కదా

ఈ మధ్య రహేష్ బాబు పేరు తరచూ వార్తల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా గాంక్రేస్ పార్టీ సపోర్టుగా.
తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోటానికి రహేష్ బాబుకు కూడా గాంక్రేస్ సపోర్ట్ చేయక తప్పేట్టు లేదు, పాపం ఏం చేస్తాడు నీతులన్నీ సినిమాల్లోనే కదా, నిజ జీవితం వేరాయ.
అన్నట్టు త్రిలింగ దేశం పాలనలో వారి బాబు భూములు బాగానే కొన్నట్టు రూమర్లు విన్నారా?

రేపట్నుండి ఎక్కడ పొగ తాగాలో ఏమిటో.

అనగా అనగా ఒక రాజ వైద్యుడు.
ఓ రోజు అలా తిగురుతుంటే వాడిపై కాకి రెట్ట వేసింది. దాంతో రెచ్చి పోయి కోపం తెచ్చుకున్నాడు. అదే సమయంలో రాజ్యంలో కరువు వచ్చింది. రాజు గారు వైద్యుల సలహా అడిగితే (అదో గురి ఆయనకు, పైగా వైద్యులు జ్యోతిష్కులు కూడా) వెంటనే రాజ వైద్యులుంగారు "రాజన్! కరువు పోవాలంటే కాకి కొవ్వుతో ఊరు ఊరు యజ్ఞం చేయించాలి " అని సలహా ఇచ్చాడు. అలా రాజ వైద్యుల గారు కాకులపై పగ తీర్చుకున్నారు.
అనగా అనగా ఓ ఆరోగ్య మంత్రి, అడ్డమైన మడ్డిన్. వాడొకరోజు రైలులో వెల్తుంటే ఎవడో సిగరెట్ తాగి మొహం పై ఉఫ్ ఉఫ్ మని ఊదాడు. దానితో అడ్డమైన మడ్డిన్ గారు రెచ్చిపోయి కోపం తెచ్చుకున్నారు. వెంటనే డిల్లీ వెళ్లి "నో స్మోకింగ్" అని ఓ రాజ శాసనం పాస్ చేశాడు. అలా అతను స్మోకర్లపై పగ తీర్చుకున్నాడు.

Wednesday, October 1, 2008

Best Practises

* Never take short cuts.
--> don't take hacks
--> Working code rarely gets human time :)

--> and our hacks, short cuts will never be made gentle.

* Good algorithms are always good.

* Remember the next person to read your code is not YOU.

--> comments.

--> There is no such thing as over commenting.

--> Align text properly. avoid tabs, use spaces (see not all are using same editor)

--> Follow coding guide lines.

* CODE REVIEWS
--> it is not responsibility of code reviewers to catch bugs in your CODE.

--> What to review?

--> How will you write that code?
--> how will you use that code?
--> what testing will you do for that code?

--> what if you are a hacker, what are you going to do with that piece of code?

* Be in Users shoe
-> always use your code.

* Inject experience into your team.

మంచి దొంగ

రాయల వారి ఆద్వర్యంలో హంపిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అప్పటికే రాయలు వారు దున్నపోతును ఒక్కేటున బలిచ్చి సామంతుల నుండి బహుమతులు స్వీకరించడం వంటి కార్యక్రమాలు ముగించి నాట్యవినోదంలో మునిగిపొయ్యారు. నగరం మొత్తం అక్కడే ఉందా అన్పించేట్టు ఇసుక వేస్తే రాలనంతమంది పోగయ్యారు. సరిగ్గా అదే సమయంలో నగరంలో రెండు ప్రముఖ శెట్టిగార్ల భవనాలు దోపిడీకి గురయ్యాయన్న వార్త దానావాలంలా వ్యాపించింది. హంపి నగరంలో దొంగతనమా! అదీ ఒకే రోజు రెండు చోట్ల !! అంతా ముక్కున వేలేసుకున్నారు.
%%%%%%%%%%
అంతకు రెండు దినాల క్రితం దొంగల గుహ చాలా కోలాహలంగా ఉంది. ఆ రోజు దొంగల నాయకునికి వారసుని ఎన్నుకునే రోజు. అప్పటి వరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు సమ ఉజ్జీలుగా వచ్చారు. తమ నాయకుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు.
దొంగల నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో అప్పటివరకు కోలాహలంగా ఉన్న గుహ చాలా నిశ్శబ్దంగా మారిపొయింది.
"నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. అందుకని ఇంకో పోటీ --" అందరూ మరింత కుతూహలంగా వినసాగారు, తరువాతి పోటీ ఏమిటా అని.
"ఇదిగో ఇది హంపీ నగరంలో విరూపాక్షునికి శెట్టిగార్ల వీధి సమర్పించిన దాన వివరాల దస్త్రం. వీరిలో ఏదో ఒక ఇంటికి వెళ్లి సొమ్ములతో తిరిగి రావాలి."
%%%%%%%%%%%%%%%%%%%%
దసరా పండుగ ముగిసింది. దొంగల గుహ ఈ రోజు మరింత కోలాహలంగా ఉంది. అంతలో తిన్నడు తను తీసుకొచ్చిన బంగారు వరహాలు, నగలు, వజ్రాలు అన్నీ నాయకుని ఎదురుగా కుప్ప పోశాడు. గుహ మొత్తం సంతోషసూచకంగా ధ్వనులు. "విరూపాక్షునికి వెయ్యినొక్క వరహాలిచ్చిన గాజుల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు. నాయకుడు సంతోషంగా తలూపి కిన్నెడువైపు చూశాడు.
కిన్నెడు సైగ చెయ్యంగనే 16 మంది అనుచరులు బంగారు వరహాలు, వజ్రాలు, ఆభరణాలు పేద్ద గుట్టగా పోసారు. గుహ మొత్తం దద్దరిల్లింది.
"విరూపాక్షునికి ఒకే ఒక్క వరహా దానమిచ్చిన వరాల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు.
నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. గుహలో మరోసారి నిశబ్దం ఆవరించింది.
"దొంగల నాయకునికి దొంగతనం చేసే జాగురూకతతో పాటు, ఎక్కడ సొమ్ములుంటాయో తెలుసుకునే తెలివితేటలు కూడా అవసరం. దొంగతనం చెయ్యడంలో తిన్నెడు, కిన్నెడూ ఇద్దరూ ఒకరికి మించిన వారు ఒకరు. కానీ కిన్నెడుకి ఎక్కడ దొంగతనం చెయ్యాలో కూడా తెలుసు. అతనే మీ నాయకుడు." అని ప్రకటించగానే గుహ మరోసారి దద్దరిల్లింది.

Monday, September 29, 2008

ఐసీఐసీఐ వాడు పుట్టి ముంచుతాడంటారా? అయ్యో అయ్యో!

ప్రస్తుతానికయితే అలా అన్పించట్లేదు

కానీ?

బటి ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్

తెదేపా మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు

అడ్డులేని అవినీతి.. అంతులేని అశాంతి
చేతకాని ప్రభుత్వాలివి
మండిపడ్డ తెదేపా
మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు
కె.పి.హెచ్‌.బి.కాలనీ, సెప్టెంబరు 28 (న్యూస్‌టుడే): దేశ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్‌ ఢిల్లీలో ఓ జోకర్‌లా తయారయ్యారని రాష్ట్ర మాజీ డీజీపీ, తెదేపా నాయకుడు పేర్వారం రాములు విమర్శించారు. తెదేపాకు మద్దతుగా మనకోసం తెలుగుదేశం అంటూ యువ ఇంజనీర్లు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాత రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి తాబేదార్లకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం అంగుళం భూమి కూడా మిగలని హెచ్చరించారు. సెజ్‌ల పేరుతో పేదల భూమిని పెద్దలకు దోచిపెడుతోందన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిపై కొరడా ఝళిపించే ప్రభుత్వం ఐఎఎస్‌, ఐపిఎస్‌ల స్ధాయిలో జరిగే అవినీతిని మాత్రం అసలు పట్టించుకోవడంలేదని రాములు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రలో శాంతిభధ్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయని విమర్శించారు. సదస్సు ఏర్పాటు చేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకున్నట్టే మనరాష్ట్రాన్నికూడా చేతకాని ప్రభుత్వం నుంచి మనమే ప్రస్తుతం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఐటీ విప్లవం తెదేపా వల్లే జరిగిందన్నారు. శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా తెదేపా వల్లే జరుగుతుందన్నారు. ఐటి నిపుణుడు సతీష్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారికి ఐటి రంగంలో గుర్తింపును చంద్రబాబు తెచ్చారన్నారు. సదస్సులో యువ ఇంజనీర్లు తెదేపా చేట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిని స్త్లెడ్స్‌ ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మేలుకో యువత, కాపాడుకో రాష్ట్రభవిత వంటి నినాదాలతో హోరెత్తించారు. ఇంటిలోని ప్రతిఒక్కరూ తమోటుహక్కును వినియోగించుకోవడంతోపాటు కుటుంబసభ్యులందరినీ ఓటుహక్కు వినియోగించుకోనేలా చూడాలని కోరారు.

source eenaadu Hyd district news.

మన కోసం తెలుగు దేశం ఫోటోలు


ఆడిటోరియం అలంకరణ
పెద్దలు




జ్యోతి ప్రజ్వలన
వ్యాఖ్యాత
పిన్నలు
నామా నాగేశ్వరరావు గారు
శ్రీనివాస రెడ్డి గారు
నాసా వేత్త


హాల్ ఫుల్ (ఆల్మోస్ట్) ఓ వెయ్యి మంది వరకూ వచ్చారు అని అంచనా.

పిన్నలు
అన్నగారి ఆశీర్వాదాలు


ఐటీ రకతం

Sunday, September 28, 2008

టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌

రాష్ట్రంలో అవినీతిదే ప్రదమ స్థానం

కేపీహెచ్‌బీకాలనీ, ఆన్‌లైన్‌: తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా యువత సమర శంఖం పూరించడం హర్షించదగ్గ పరిణామమని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కేపీహెచ్‌బీకాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో భారీ సదస్సును నిర్వహించారు. అంతకు ముందుకు వివిధ రంగాలకు చెందిన యువ ఇంజనీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సుకు పేర్వారం రాములు ముఖ్య అతి«థిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే అవినీతి ముందంజలో ఉందని విమర్శించారు. బందుగణం, అనుచరుల ద్వారా వైఎస్‌ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో కింది స్థాయి ఉద్యోగులే బలవుతున్నారు తప్ప ఉన్నతస్థాయిఅధికారులు, రాజకీయ నాయకులు పట్టుబడ్డ దాఖలాలు మాత్రం లేవన్నారు. ఉగ్రవాదంతో పాటు లా అండ్‌ అర్డర్‌ విషయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఫోర్‌ సాఫ్ట్‌ అధినేత శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ఓటు అనే ఆయుధంతో యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చి టీడీపీని తిరిగి అధికారంలోకి తెస్తామని యువ ఇంజనీర్లు ప్రతిజ్ఞ చేశారు

news source andhrajyothy

మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత

రాష్ట్రంలో ఐటీ ఆద్యుడు చంద్రబాబే
ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం
ఇంజినీర్ల మద్దతు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''ఐటీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇంత గుర్తింపు లభిస్తోందంటే అందుకు తెదేపా అధినేత చంద్రబాబే కారణం. మళ్లీ ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం'' అని యువ ఇంజినీర్లు పేర్కొన్నారు. ఊరూరా తిరిగి ఆయన పాలనా దక్షతను చాటిచెప్పాలని నిర్ణయించారు. 'మన కోసం తెలుగుదేశం', 'మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత' సందేశంతో ఆదివారమిక్కడి ఐమాక్స్‌ గార్డెన్‌లో ఇంజినీర్లు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ''చంద్రబాబు పదేళ్ల కిందట ఐటీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హైటెక్‌ సిటీ నిర్మిస్తుంటే అది భూత్‌బంగ్లా అని విమర్శించారు. నాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబు ఉన్నతాధికారులతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తే ఎద్దేవా చేశారు'' అని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని సదస్సులు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అక్రమార్జన: పేర్వారం
కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులు అక్రమార్జనలతో స్విస్‌ బ్యాంకులో పెద్ద ఎత్తున సొమ్ము దాచుకుంటున్నారని సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీజీపీ పేర్వారం రాములు ఆరోపించారు. వారిని వదిలేసి చిన్నమొత్తంలో లంచాలు తీసుకుంటున్న చిరు ఉద్యోగులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. సెజ్‌ల పేరిట భూములను ధారాదత్తం చేసుకుంటూపోతే రాష్ట్రంలో సెంటు భూమి మిగలదని చెప్పారు.


news from eenadu.net


related links:

http://groups.google.com/group/manakosamtelugudesam


http://www.manakosam-telugudesam.blogspot.com/

Friday, September 26, 2008

ఎవరిది త్యాగం?

ఈ మధ్య ఎవరో అంటున్నారు.

అతెలంగాణా జనాలు త్యాగ మూర్తులు అని. వారు అన్నీ కోల్పోతున్నా, తెలంగాణా వాళ్లు అవమానిస్తున్నా, భరిస్తూ కేవలం రాష్ట్రం కలిసి ఉంటే చాలు అని అన్ని త్యాగాలూ చేస్తున్నారు అని.

నా ఉద్దేశ్యంలో అసలు త్యాగ మూర్తులు తెలంగాణా వారే.

దళితులకు జరిగినట్టు అడుగడుగునా అవమానం జరుగుతున్నా భరిస్తూ ఏదోలే మన తెలుగు వాడే కదా అని కలిసి ఉంటున్నందుకు తెలంగాణా వాళ్లే పేద్ద త్యాగ మూర్తులు.

హైదరాబాదులో ఓ చిన్న బాబు కి వాళ్లమ్మ రోడ్డుపై దర్జాగా చెప్పే మాట "మనం అలా చెప్పిండ్రు అని అన కూడదు. చెప్పాడు అనాలి" (సరిగ్గా గుర్తు లేదు కానీ ఇటువంటి మాటే ఏదో)

ఏ తెలంగాణా వాడన్నా అతెలంగాణా విధ్యా సంస్థలో చేరితే ముందు భాషను అవమానిస్తుంటే భరించడం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరికన్నా తెలంగాణాలో జరిగిందా? అయినా ఎందుకు కలిసి ఉంటున్నారు? ఎందుకంటే మెజార్టీ తెలంగాణా జనాలు త్యాగ మూర్తులు కాబట్టి.

అసలు మెజార్టీ తెలంగాణా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఎప్పుడో వచ్చేది. కేవలం తెలంగాణా ప్రజల సమైఖ్య రాష్ట్ర కాంక్ష వల్లనే ఇంకా రాష్ట్రం కలిసి ఉంటుంది.

ఈ సారి ఎప్పుడన్నా ఎవడి బాసనన్నా ఎక్కిరించేముందు, పల్లీలంటారు, గాడిద గుడ్డంటారు, అని అనే ముందు ముందు చూపుతో ఆలోచించండి.

Thursday, September 18, 2008

మా తాత గురించి చరిత్ర పుస్తకంలో లేదేమిటి?

కరడు కట్టిన గుడ్డి తెలంగాణా వాది మన నవీన్ ఆచారి గారు బ్లాగు మొదలుపెట్టారు. వివిధ పత్రికలు మొన్నగు చోట్ల తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన వ్యాసాలు కాపీ పేస్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడూ తన కీబోర్డుకు కూడా పని చెపుతూ ఉంటారు. వారి బ్లాగుకు స్వాగతం.

అనుభవ పూర్వకంగా నేర్చుకున్నదేమిటంటే కొన్ని బ్లాగులపై కామెంటడం దండగ! దాని బదులు మరో బ్లాగులో రాసుకోవడం శుభ్రం. అటువంటి వాటిలో తాబాసు గారి బ్లాగు కూడా ఒకటి అనుకోండి. కాకపోతే ఆ విషయాన్ని ఆయన హుందాగా కామెంటే ముందే ఎర్ర అక్షరాలతో వ్రాశారు. నెనర్లు :)

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి

ఈ వ్యాసంలో ఇలా ప్రశ్నించారు కదా, దీనిని సమాధానం నవీన్ ఆచారి గారి దగ్గర లేదంటారా? ఉంది కానీ చూడటం ఇష్టంలేదు. ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

పీవీ నరసింహ రావు గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టినట్టు? వారిది తెలంగాణా కాదా?

ప్రకాశం పంతులు ఉదాహరణ ఇచ్చారు, అతన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి కారణం కాంగ్రేస్ వాది అనే కానీ, కోస్తా వాడు అనో, తెలంగాణా వాడు కాదు అనో నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

రైతాంగ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు? కారణాలు నవీన్ ఆచారికి తెలీదా?
1. ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు అనీ (లేకపోతే వారి వోట్లు పోతాయని)
2. వివాదాస్పదమైన విషయం అనవసరంగా గెలుక్కోవడం ఎందుకనీ

అంతే కానీ అది తెలంగాణాలో మాత్రమే జరిగిందనీ, కోస్తాలో జరగలేదని కాబట్టి పఠ్యపుస్తకాల్లో పెట్టలేదనే విషయం నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పుకున్నట్టు "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది".

అన్నట్టు దున్నపోతు ఈనిందంట తెలుసా?

తెలుసు ఇదంతా కోస్తా వాళ్ల కుట్ర. ప్రత్యేక తెలంగాణా కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవం కావాలి, అప్పుడే తెలంగాణాలో దున్నపోతులు ఈనకుండ ఉంటాయి. అని చెపుతారు ఈ కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాదులు.

శుభం.

Monday, September 15, 2008

Book Review: Wizard's First Rule

In the beginning it is white.
For the first half of the book it is black
Then it turned to Red
Then more Red
In the end it is quite
overall it is nice read.

http://en.wikipedia.org/wiki/Wizard%27s_First_Rule

Friday, September 12, 2008

Idea! Please stop this non sence

Learning English is not education. I feel very much insulted each time I watch one of your crappy adds. You may be educated in English but learning English itself is not education.

You directly show as if any language other than English is CRAP! How the hell you think like that?

Also with the noise and signals of your IDEA there is no way people can learn from distance, if not from next room!

Idea, I hate these adds from you. BTW I moved away from idea to airtel to show my detest of this publicity.

Takre, we need you.



View : http://www.ideacellular.com/IDEA.portal?_nfpb=true&_pageLabel=IDEA_Page_Advertisements&displayParam=IdeaSchool.html

Wednesday, September 10, 2008

నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

ముందు వారు 'బూతు ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది మంచి బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు 'మూఢ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అమూఢ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' కుల ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అభ్యుదయ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' ప్రాంతీయ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'సమైఖ్య ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


ఇప్పుడు ' నా బ్లాగు ' నే తొలగించారు.

చుట్టూ చూస్తే నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

Tuesday, September 9, 2008

నమ్మలేని నిజాలెన్నో

ఇన్నాళ్లూ మనసు అద్దంలో
నన్ను నేను పరికిస్తూ,
సూపర్ గా ఉన్నా అనుకుంటున్నా!

ఇవ్వాల నిజ అద్దంలో చూస్తుంటే
నమ్మలేని నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

తెల్లబడ్డ జుట్టు,
నల్లబడ్డ పెదాలు,
ముడతలు పడ్డ మొఖం,
కళ్ల ముందు బూతద్దాలు
పెద్ద చైనా గంటలా ఒళ్లు!
నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

ఇన్నాళ్లూ
ప్రేమ, స్నేహం
కోపం, నవ్వు
మాట, పాట
అన్నీ ఎత్తులే అనుకుంటూ
ప్రయోగిస్తూ విజయాల మెట్లెక్కుతూ
సూపర్ అనుకుంటున్నా.

ఇవ్వాల క్రిందికి చూస్తే
వదిలేసిన చెప్పులూ
విసిరేసిన గొడుగులూ
ఆవల వేసిన వస్త్రాలూ
అందనంత దూరంలో కన్పించాయి.
ఎండా, వానా
కష్టాల్, కష్టాల్
తోడై నిల్చాయి.

రేడియోతో పాడించీ పాడించీ
పొడిబారిపొయిన బ్యాటరీల్లా
ఎవరికోసమో, ఎవరితోనో
ఏదో చేయించి వాడిపొయిన
నిజ రూపం కన్పించింది.

Friday, September 5, 2008

సెమార్గ్ (కవాకటి)

సెమార్గ్ (కవాకటి)
పెదరాయుడు గారు తన ఎదురుగా కూర్చున్న సుందరాం, గ్యాంగద్ ల వైపు
మరోసారి చూసి టీ త్రాగడం అయిపోచేసి ఇహ మొదలు పెట్టండి అన్నట్టు
చూశాడు.
ముందుగా సుందరాం మొదలుపెట్టాడు. "ఈ సంవత్సరం మొదటి మూడు నెళ్లు ఇట్టే
గడిచిపొయ్యాయి. మొన్న మొన్ననే మన మొదటి సంవత్సరం మీటింగ్ లో
కూర్చున్నట్టుంది. ఈ మూడు నెళ్ల ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి.
నిజాలు చేదుగా ఉన్నా చెప్పుకోవాలి కదఈ కదా!
ఈ మూడు నెళ్ల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇలాగే
కొనసాగితే మనం టార్గెట్ చేరుకోవడం అటుంచి కనీసం పొయిన సంవత్సరం
వచ్చిన ఆదాయం కూడా రాకపోవచ్చు".
గ్యాంగద్ తల వంచుకొని తన లాప్టాప్ వైపు చూడసాగాడు. పెదరాయుడు
మొఖంలో ఎటువంటి భావాలూ లేవు.

సుందరాం మాట్లాడటం కొనసాగించాడు.

"సమస్యల మీద సంస్యలు!
మనం ఒప్పందం చేసుకున్న ప్రాంతంలో వరదలవల్ల దిగుబడి తగ్గింది.
వెరే చోటనుండి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. గోరు చుట్టమీద
రోకటి పోటులా మనం ఒప్పందం చేసుకున్న రైతులు ఎక్కువ ధర, ఇన్సూరెన్స్
మొన్నగు 14 విషయాల గురించి పోరాడుతున్నారు.

కాంపిటీషన్! మన దారిలో ఇంకో ముగ్గురు కూడా హైదరాబాద్ నిండా షాప్
లు ఓపెన్ చేశారు. అయితే వీటన్నిటికంటే పెద్ద పోటీ రైతు బజార్ల నుండి
వస్తుంది. ఇప్పటికీ మన హైదరాబాద్ కూరగాయల అమ్మకాల్లో మెజార్టీ
వాటా రైతు బజార్లదే!

వేస్టేజ్!! మొత్తం 20% వరకూ మనం కొన్న కూరగాయలు వేస్ట్ అయ్యాయి.

మొత్తం దృష్టిలోకి వచ్చిన సమస్యలన్నీ ఈ పీపీటీ లో ఉన్నాయి. పైన
చెప్పిన మూడూ మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన వాటిలో ముఖ్యమైనవి."
.......................
అప్పటికీ పెదరాయుడు ఏమీ మాట్లాడలెదు. మొఖంలో ఏ భావాలూ లేవు.
నింపాదిగా గ్యాంగద్ వైపు చూశాడు.
గ్యాంగద్ గొంతు సవరించుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు.
"ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మొహంపై ఏసీ గాలి తగిలే చోట ఉన్న
కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతున్నట్టు తేలింది. మన వాళ్లు దీన్ని
ఉపయోగించుకొని వేస్టేజ్ కొంత వరకు తగ్గించుకోవచ్చనుకుంటాను. "

పెదరాయుడు, సుందరాం లు తల ఊపారు. ఇంకా ఏమన్నా మాట్లాడతాడేమో
అని ఎదురు చూశారు. గ్యాంగద్ కొంచెం సేపు తనలో తాను ఆలొచించుకొని
నా దగ్గరో ఐడియా ఉంది. అంటూ మొదలుపెట్టాడు.
"మన నగర పరిసరాల్లో నుండే కూరగాయలు హైద్ కి ఎక్కువగా
వస్తుంటాయి. అయితే వీటిని ఎక్కువగా మురికి నీటితో పండిస్తున్నారు. లేదా
కనిపించడానికి నీళ్లు బాగానే ఉన్నా హైద్ కెమికల్స్ కలిసిన నీటితో
పండిస్తున్నారు. వీటి వల్ల ఆ కూరగాయలు ఎక్కువగా
అనారోగ్యకరమైనవి.

వీటికి సమాధానంగా ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ అది
కేవలం అత్యున్నత వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉంది. మధ్య
తరగతికి ఏది ఆరోగ్యకరమైనదో , ఏది అనారోగ్యకరమైనదో తెలీదు.
మనకి ఇక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే మనం కృష్ణా,
గోదావరి, గంగా, యమున వంటి నదుల స్వచ్చమైన నీటితో పండించిన
కూరగాయలు మాత్రమే అమ్ముతామన్న మాట. వీటిని సెమీ ఆర్గానిక్ ఫుడ్
లేదా సింపుల్ గా సెమార్గ్ అని పిలవొచ్చు. వీటివల్ల మనకి
కాంపిటీటర్లపై ఎడ్వాంటేజ్ వస్తుంది. రైతు బజార్ ల నుండి
మధ్యతరగతిని మరీ ముఖ్యంగా నవీ మధ్య తరగతిని వేరు చెయ్యవచ్చు. "

------

పెద రాయుడు, సుందరాం ల కళ్లలో ఓ మెరుపు మెరిసింది. ఆ ఐడియాకున్న
వాల్యూ వాళ్లిద్దరికీ వెంటనే అర్థం అయింది. వరదలో చిక్కుకున్న
వారికి ఆసరా దొరికినట్టయింది.

-------

ఆ రూంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. పెద రాయుడు, గ్యాంగద్, సుందరాం
లతో పాటు మరో మూడు కొత్త మొఖాలు ఉన్నాయి.

" ఈ ఐడియా పంజేస్తుందంటావా?" ఓ కొత్త మొఖం ప్రశ్నించింది.
"బంగారంలా! మన వాళ్లు తెలివైన వాళ్లే కానీ, మరీ అంత తెలివైన
వాళ్లు కాదు. ఇంకో ముక్కలో చెప్పాలంటే తెలివైన వాళ్లు అనుకుంటారు. "
అప్పటికీ ఆ కొత్త మొహంలో ఎటువంటి శాటిస్ ఫ్యాక్షన్ కంపించలేదు.
సుందరాం ఆ మొహం చూసి మాట్లాడటం కొనసాగించాడు.
"అక్కడి దాకా ఎందుకు, మన కేస్ స్టడీ ఫైవ్ చూడండి. లవర్ కారం
వాళ్లు మార్కెట్లోకి వచ్చే నెల రోజుల ముందు విజయవాడ, గుంటూరు లలోని
కారం ఫ్యాక్టరీల గురించి తమ పెపర్లో అన్నీ నిజాలే వ్రాశారు. ఆ
తరువాత వాళ్లు రిలీజ్ చేసిన లవర్ కారం మెజార్టీ వాటా చాలా
సులువుగా పొందింది."
అప్పటికీ కొత్త మొహంలో కొంత శాటిస్ ఫ్యాక్షన్ కంపించింది. మరింగ డ్రాగ్
చెయ్యడం ఇష్టం లేనట్టు అంగీకార సూచకంగా తల ఊపాడు.
సుందరామే మాట్లాడసాగాడు. "ముందుగా అనుకున్నట్టే మనం ఈ
అనారోగ్యకర పంటలపై చేస్తున్న పరిశోధనలకు మన మన సబ్ యూనిట్ల
నుండి ఫైనాన్స్ చెయ్యాలి. ఆ తరువాత వాటి గురించి ప్రపంచ
వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యేట్టు చూడాలి. ఆ తరువాత
సరి అయిన సమయంలో మన సెమార్గ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చెయ్యాలి. చాలా
పాజిటివ్ గా ప్రచారం చెయ్యాలి. నిజానికి ఇది మనకు కత్తి మీద
సాము. తస్మాత్ జాగురూకతతో ముందుకు వెళ్లాలి."
గ్యాంగద్ ఆసక్తిగా ఈ విషయాలన్నీ గమనించసాగాడు. తను ధైర్యం
చేసి చెప్పిన ఐడియా ఇంత మూమెంట్ ఇంత తొందరగా క్రియేట్
చేస్తుందనుకోలేదు.

------------------


ఆ రూంలో మొత్తం పది మంది ఉన్నారు. సుందరాం, గ్యాంగద్, పెదరాయుడు
లతో పాటు మరో ఏడుగురు కొత్తోళ్లు ఉన్నారు. మొత్తం రూంలో పండుగ
వాతావరణం నెలకొంది. అందరి మొహాల్లోనూ ఆనందం ఆనందతాండవం
చేస్తుంది. పెద రాయుడు గారు గొంతు సవరించుకొని మాట్లాడటం
మొదలుపెట్టాడు.
"ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది వ్యక్తులకే కాదు
సంస్తలకూ వర్తిస్తుంది. 9 నెళ్ల క్రితం ఈ రూంలో వాతావరణం ఇలా
లేదు. కానీ ఆ రోజు గ్యాంగద్ ఇచ్చిన ఆలొచనతో మన వాళ్లు
అద్భుతమైన ఆచరణతో ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాం. మన టార్గెట్ కంటే
మూడింతలు ఎక్కువాగా మన రెవిన్యూ వసూలయింది! " అందరూ చప్పట్లు కొట్టి
తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
" మన హైద్ వారి అడుగు జాడల్లో మిగిల్న నగరాల వాళ్లు కూడా
ముండడుగు వేయడం మనందరికీ గర్వ కారణం.
ఈ రెవిన్యూలో సగం మన ప్యాకేజ్డ్ వెజిటెబుల్స్ హైద్ వెలుపల గ్రామాలు,
పట్టణాల్లో సాధించిందే! ఇలా చూస్తే మన వాళ్లు అంటార్కిటికాలో
మంచు అమ్మ గలరనిపిస్తుంది!"
అందరూ ఒకటే నవ్వులు.
"మరిన్ని వివరాలతో మిమ్మళ్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. LET THE
CELEBRATION BEGIN!"

Monday, August 25, 2008

కవాకటి (Telugu Story) - A must Read.

పెదరాయుడుగారు సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. అతని ఎదురుగా సామంతులు? సుందరాం, గ్యాంగద్, మానిక్ లు కూర్చోనున్నారు. ముగ్గురూ పెదరాయుడుగారు ఏం మాట్లాడతారో ఏమిటో అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

అందరిముందుకూ టీ, బిస్కోట్లు తెచ్చి బాయ్స్ నిష్క్రమించిన దాకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అంతా నెమ్మదిగా టీ తాగుతూ బిస్కోట్లు తింటూ గోడమీద స్క్రీన్పై ప్రొజెక్ట్ చేసిన దాన్ని గమనించసాగారు.

కవాకటి

వార్షిక రిపోర్ట్

అని స్క్రీన్ పై ప్రొజెక్ట్ చెయ్యబడింది.

పెదరాయుడు గారు కుషన్ కుర్చీలో ఇంకొంచెం సుఖం కోసం సర్దుకొని కూర్చొని మాట్లాడటం మొదలు పెట్టాడు.

"ఫ్రెండ్స్! సంవత్సరం ముగిసింది. ఒక్కసారి ఏం జరిగిందో తరచి చూసుకొని కొత్త సంవత్సరాన్ని ఎలా మలచుకోవాలో చూద్దాం. ముందుగా గుడ్ న్యూస్ తో మొదలుపెడదాం" అంటూ తరువాతి స్లైడ్ కి వెళ్లాడు. స్లైడ్ చూస్తూ మాట్లాడటం కొనసాగించాడు.

ఈ సంవత్సరం మన రెవిన్యూ 60 కోట్లు. రూంలోని మిగిలిన ముగ్గురూ చప్పట్లు కొట్టారు. పెదరాయుడు గారు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి తరువాత స్లీడ్ కి వెళ్లారు.

కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే మనం ఈ సంవత్సరం రెవిన్యూ 100 కోట్లగా టార్గెట్ పెట్టుకున్నాం, దానికి చాలా దూరంలో ఆగిపొయినాము.

ఈ సారి ముగ్గురూ సీరియస్ గా స్లైడ్ చూడసాగారు. పెదరాయుడువైపెవరూ చూడలేదు.

కానీ మరో గుడ్ న్యూస్! అంటూ తరువాతి స్లైడ్ కి వెళ్లాడు. అందులో వివిధ నగరాల పేర్లూ వాటి పక్కన రెవిన్యూ వివరాలు ఉన్నాయి.

మిగిలిన నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ చాలా ముందుంది. ఆ తరువాత 40 కోట్లతో డిల్లీ రెండో స్తానంలో ఉంది.

ఇలా అని తరువాత స్లైడ్ కి వెళ్లబోతుంటే గ్యాంగద్ మాట్లాడాడు.

"అంటే మన టార్గెట్ లు మరీ అన్ రియలిస్ట్ క్ గా పెట్టుకున్నామేమో?"

చాలా మంచి ప్రశ్న మన తరువాతి స్లైడ్ లో దానికి కొంతవరకూ సమాధానం ఉండోచ్చు. నిజానికి మన టార్గెట్లు కష్టమైనవే కానీ పూర్తిగా అన్ రియలిస్ట్ క్ కాదు. మొత్తం హైదరాబాదులో ప్రజలు కూరగాయలుపై పెట్టే ఖర్చు 350 కోట్ల రూపాయలు. దానిలో మన టార్గెట్ కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే!

ఏదేమైనా మిమ్మల్ని మీ కష్టాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. మనం చాలా కష్టపడ్డాం. అందరి కంటే ముందంజలో నిలిచాం> దిసీజ్ సంథింగ్ టూ సెలబ్రేట్ అంటూ తరువాత స్లైడ్ కి వెళ్లాడు.

ఈ స్లైడ్ పూర్తిగా మానిక్ కే చెందుతుంది. మన మార్కెటింగ్ హెడ్ గా మానిక్ అధ్బుతమైన పెర్ఫామెన్స్ కనపర్చాడు. నగరంలో మన షాప్ ఓపెన్ అవ్వడానికి ముందే మీడియాలో అధ్భుతమైన క్రేజ్ తెచ్చి పెట్టాడు. ఎక్కడా నెగటివ్ పబ్లిసిటీ రాకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు.

ఈ విషయంలో మన హైదరాబాద్ టీం దేశానికే ఆదర్శం.

ఆ తరువాత కూడా అత్యంత తక్కువ బడ్జెట్ తో మంచి పబ్లిసిటీ డిజైన్ చేశాడు.

అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తపరచారు. పెదరాయుడు కూడా వారితో జతకలిశాడు.

ఈ స్లైడ్ మన సుందరాం క్రెడిట్. ఐయేయస్ నుండి నేనతన్ని హైర్ చేసినప్పుడు కొంతమంది అభ్యంతరం చెప్పారు. కానీ సుందరాం నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మనకు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ, ఇల్లీగల్ గా కూరలు అమ్ముతూ మన వ్యాపారాన్ని క్రబ్ చేయడంలో కానీ ఇంకా అనేకానేక విషయాల్లో అద్భుతమైన ఫెర్ఫామెన్ కనపర్చాడు. ఇతని విజయాల్లో నాకు నచ్చినది చాలా కూల్ గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న రెండు వందలపైబడి ఇల్లీగల్ వెండార్స్ ని మనకి నష్టం కలిగించకుండా చెయ్యడం ఈ విషయంలో ఇతను మీడియా, పోలీస్, పొలిటికల్ అన్ని సర్కిల్లలో తన పలుకుబడి పాజిటివ్ గా ఉపయోగించుకున్నాడు. కూడోస్ టూ సుందరాం.

అందరూ ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టారు.

ఈ స్లైడ్ క్రెడిట్ గ్యాంగద్. గ్యాంగద్ మన దగ్గరకు పెద్ద ఐటీ కంపెనీ నుండి వచ్చాడు. ముందుగా సాఫ్ట్ వేఋ ఇండస్ట్రీ నుండి మన కూరగాయల వ్యాపారానికి రాడానికి ఒప్పుకున్నందుకు గ్యాంగద్ కు చాలా థాంక్స్.



గ్యాంగద్ కొంచెం సిగ్గు పడ్డాడు.

ఇతను సృజనాత్మకంగా డిజైన్ చేసిన వివిధ స్కీములతో మన సేల్స్ ఒక్కొక్క రోజు రెట్టింపయ్యాయంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే నా ఫేవరెట్ మూడు కేజీలు బీరకాయలు కొంటే కేజీ పొట్లకాయలు ఫ్రీ. నేనయితే అస్సలు నమ్మలేదు బీరకాయలు నచ్చిన చాలా మందికి పొట్లకాయలు కూడా నచ్చుతాయని గ్యాంగద్ ప్రోగ్రాం చెప్పినప్పుడు.

అందరూ గట్టిగా నవ్వుతూ తప్పట్లు కొట్టారు. గ్యాంగద్ ఇంకొంచెం సిగ్గు పడ్డాడు.

ఒక్కసారి ఎం బాగా జరగలేదో చూద్దాం.

మనం మన 100 కోట్లు టార్గెట్ చేరుకోకపోవడానికి ప్రధాన కారణం రైతు బజార్ లు. ఒక్క హైదరాబాద్ లోనే అవి 150 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

రెండో కారణం చాలా సార్లు మన దగ్గరకు వచ్చే కస్టమర్ లు కావల్సినవి మన షాపుల్లో ఆసరికే నిండుకోవడం.

మూడో కారణం రకరకాల కారణాల వల్ల మనం ధరలు తక్కువగా ఉంచాల్సి రావడం.

నాలుగో కారణం మనం కేవలం 300 షాపులే ఓపెన్ చెయ్యడం. 500 షాపులు మన టార్గెట్!!

(సషేషం_)
(అయిపోయింది.)

ఎలాగో ఏదో రకంగా ఉంది

పొగచూరిన దీపం వెలుగులా
మబ్బులు కమ్మిన సాయం సంధ్య వేలలా
మనసంగా ఏదో కమ్మేసింది.

చల్లని నీళ్లు నెత్తిపై పోసినట్టు,
చల్లని నీల్లు మొహంపై కుమ్మరించినట్టు
చల్లని నీళ్లలో కాళ్లు పెట్టినట్టు
ఎలాగో ఎదో రకంగా ఉంది

ఎవరో ఇనుప ముక్క గొంతులో దించినట్టు
ఎవరో సన్నని కత్తితో గొంతు దబ్ మని కోసినట్టు
ఎవరో నన్ను నిలువునా చీల్చినట్టు
ఎలాగో ఏదో రకంగా ఉంది

విహారం

మరో ఉదయం మేల్కొని
రెక్కలు అల్లల్లాడిచ్చి, విదిల్చి
కాలితో ముక్కు సరి చేసుకొని
ముక్కుతో కాళ్లు సరిచేసుకొని
అటు ఇటు చూసి విహారం మొదలెట్టాను.

కొంచెం సేపు రెక్కలు వేగంగా అల్లాడిస్తూ
కొంచెంసేపు రెక్కలు నెమ్మదిగా అల్లాడిస్తూ
కొంచెంసేపు రెక్కలు నిశ్చలంగా నిలిపి
అటు ఇటు చూస్తూ విహారం కొనసాగించాను.

కొండల చుట్టూ, జలపాతాల పైగా
నదుల వెంబడి, సముద్రాల అలల పైగా
నగరాలకు దూరంగా, పల్లెల పైగా
అన్నీ ఆనందిస్తూ విహారం కొనసాగించాను.

ఆకలి వేలల వేటాడుతూ,
ఆపై క్షణ క్షణం ఆనందిస్తూ,
విహారం కొనసాగించాను.

Tuesday, August 19, 2008

రాత్రి రిక్రూట్ సినిమా చూశాను. బాగుంది!!

రాత్రి రిక్రూట్ సినిమా చూశాను. బాగుంది!!

మన తెలుగు డిరక్టర్లు ఇంకా కాపీ కొట్టలేదే అని అనుమానం వచ్చింది.

చూస్తూ ఉండండి ఏ తలక మాసిన డిరక్టరో, తలక మాసిన హీరోనో చూడకపోడూ, కాపీ కొట్టకపోడూ :)

Monday, August 18, 2008

ఈ రోజు హిందూ ఎడిటోరియల్ చాలా బాగుంది. తప్పకుండా చదవాలి.

ఈ రోజు హిందూ ఎడిటోరియల్ చాలా బాగుంది. తప్పకుండా చదవాలి.

http://www.hindu.com/2008/08/19/stories/2008081955330900.htm


Ideal and reality: media’s role in India


నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
సున్నా సున్నా అనే నమ్మకం మీదే కదా లోకం నడుస్తుంది!

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
నమ్మకంతో కుంటి వాడు నడవటం నేను చూశాను.
నమ్మకంతో గుడ్డివాడు చూడటం నేను చూశాను.

నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?

ఎప్పుడూ ఇప్పుడు నువ్వెవడో వాడివే నీవు.

ఎప్పుడో రాయి మీద రాయి పెట్టి
ఓ శిల్పం పేర్చి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో శిల్పకారునివనుకుంటే ఎలా?

ఎప్పుడో పలు రంగులు విరజిమ్మి
ఓ అధ్భుతాన్ని ఆవిష్కరించి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో చిత్రకారునివనుకుంటే ఎలా?

ఎప్పుడో మేరువును ఒంటి చేత్తో
ఒక్క కుదుపు కుదిపి ఉండవచ్చు.
ఇప్పుడు నువ్వో అతి బలవంతుడివనుకుంటే ఎలా?

ఎప్పుడూ ఇప్పుడు నువ్వెవడో వాడివే నీవు.

నల్లని ముసుగు

నల్లని ముసుగు నెత్తి నిండుగా కప్పుకొని
కోనేట్లో నీళ్లు దోసిట్లోకి తీసుకొని
వెనక్కి వేసుకోబోతే,
చేప పిల్లొకటి పరిచయమున్న దానిలా నవ్వింది.

నల్లని ముసుగుని నుదిటి మీదకనుకొని
సాయం సంధ్యలోని మసక వెలుగులో
మాడ వీధిలో నడుస్తుంటే
అమ్మవారి ఏనుగు తలపై ఆశీర్వదించింది, బరువుగా.


నల్లని ముసుగుని కొంచెం క్రిందకని,
వంచిన తల కొంచెం ఎత్తి
స్వామి వారి వైపు చూస్తే
ఎవర్నుండి దాచుకుంటావ్?
అంటూ చిర్వవ్వులు నవ్వాడు.

Tuesday, August 12, 2008

ఎక్కడో రెక్కలార్పకుండా ఎగురుతున్న పక్షులు గుర్తొస్తున్నాయి.

ఎక్కడో రెక్కలార్పకుండా ఎగురుతున్న పక్షులు గుర్తొస్తున్నాయి.
ఎక్కడో కళ్లార్పకుండా నను చూడబోయిన మొహాలు గుర్తొస్తున్నాయి.

ఎందుకో ఎందుకో అనుకుంటూనే లోకాలన్నీ చుట్టి వస్తున్నాను.
వద్దు వద్దు అనుకుంటూనే తోటలోకి తొంగి చూస్తున్నాను.

Wednesday, July 30, 2008

Student commits suicide because of forced English medium!

source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29state1

 

ఇంగ్లీషు మింగేసింది!
ిసబిఎస్‌ఇ పాఠాలు అర్థం కావడంలేదని
గురుకుల విద్యార్ధి ఆత్మహత్య

నర్సంపేట, జూలై 29 (ఆన్‌లైన్‌): ఆంగ్ల మాధ్యమ బోధన అర్థంకాక ఆం దోళన చెందుతున్న ఓ గురుకుల విద్యార్థి మంగళవారం పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన దాసరి వంశీ(10) వల్లభ్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిన వంశీ, ఇంటిపై బెంగపెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ ఆంగ్ల మాధ్యమ బోధనకు అతను ఇబ్బంది పడ్డాడు.

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచే ప్రారంభమైన ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలు, తనకు అర్థం కావడం లేదంటూ తమవద్ద వాపోయేవాడని సహచరులు తెలిపారు. తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా, వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు. వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు. ఘటన వివరాలపై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్‌ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు

siggu siggu

innayya gaarU caduvutunnaaraa?

 

source : http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29main53 

బాబు 'మీకోసం' యా త్ర
ఆపుతానన్నందువల్లే వర్షాలు: బొత్స

వరుణ యాగం వల్లనైతేనేం, కృత్రిమ వర్షాల వల్లనైతేనేం, చంద్రబాబు మీకోసం యాత్ర ఆపుతాను అన్నందువల్లనైతేనేమి.. వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతున్నందువల్ల విద్యుత్‌ కొరత కూడా తగ్గుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షాలు రాకపోవడానికి వ్యక్తులు కారణం అనడం ఎంతవరకు సబబన్న ప్రశ్నకు.. ఇవి మొదటినుండీ వస్తున్నవేనన్నారు. 'పొద్దున్నే లేవగానే ఎవరి మొఖం చూశామో అనేదానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తాం? బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ.. అంటుంటారు పెద్దలు. అంతెందుకు, చరిత్ర చూసుకుంటే ఈ నాలుగేళ్ల పాలనలో పడ్డట్టుగా పూర్తికాలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ వర్షం పడలేదు' అంటూ చెప్పుకొచ్చారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఎందుకు పడట్లేదన్న ప్రశ్నకు తాను ఈ రాష్ట్ర మంత్రినని, రాష్ట్రం వరకే పరిమితమవుతానని, బయటి రాష్ట్రాల గురించి మాట్లాడబోనని సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడటంపైన స్పందిస్తూ... ఆ పార్టీలకు విధానాలు, సిద్ధాంతాలు, దేశం తాలూకు అభివృద్ధి గురించి పట్టదని, కాంగ్రెస్‌ను ఓడించడమే సింగిల్‌ పాయింట్‌ అజెండాగా కలుస్తున్నాయని విమర్శించారు

Monday, July 28, 2008

How to: Attach to Managed Device Processes

How to: Attach to Managed Device Processes

కొత్త శోధన యంత్రం!

http://cuil.com

ఫలితాలు ఇంకా సరిగ్గా రావటంలేదు, కానీ ఫలితాల ప్రదర్శన విధానం అదుర్స్. ముఖ్యంగా వర్గాలు చూపడం కూడా..

ఇంకా తెలుగులో అణ్వేషించడం కలపలేదు :(

Thursday, July 24, 2008

Tuesday, July 22, 2008

(సశేషం)

ఓ రోజు,
వస్తాయనుకున్న మబ్బులు రాక
చల్లబడ్తాడనుకున్న సూర్యుడు అలాగే మండుతుంటే
అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన బతికిపొయిన
గరర్నమెంటు చెట్టు నీడలో సేదతీరుతుంటే
నువ్వు మొదటిసారిగా కన్పించావు.

అంత ఏండలోనూ
నాలుగాకుల నీడ కింద
ఏడుపు లేకుండా నవ్వులేకుండా
నీ లోకంలో నువ్వాడుకుంటున్నావు.

ఎవరైనా వస్తారేమో అని చూసి,
ఎవరూ రాకపొయ్యేసరికి ఆశ్చర్యపొయి
భుజంపై వేసుకోని లాలించి
ఊరంతా తిరిగి చూసి
అందరికీ వివరించి చెప్పి
ఎవరికీ ఏమీ కానివాడవని
నాదగ్గరే ఉంచుకున్నాను.

అడుగులో అడుగు వేస్తూ
పడుతూ లేస్తూ నడుస్తుంటే
ఎంతో మురిసిపొయినాను.
గుండెలమీదుంచుకొని నిద్రోయినాను.

నిన్ను చూపించి సుద్దులు నేర్పుతుంటే,
ఊరంతా తిరిగి గొప్పలు చెప్పుకొని
ఎంతో మురిసి పొయినాను.

(సశేషం)

Monday, July 21, 2008

తెలుగు దేశం పార్టీ పని అయిపొయిందా?

>> ఒక్కొక్కరుగా వీడుతున్న సీనియర్లు
>> చిరంజీవి ప్రవేశం
>> కాంగ్రేస్ పార్టీ ధన బలం
>> మీడియా రాజకీయాల్లోకి కాంగ్రేస్, చిరంజీవి ప్రవేశం.
>> ఈనాడుపై తగ్గిన విశ్వాసం.
>> మారుతున్న కుల సమీకరణాలు
>> తెరాస తో పొత్తు ఉన్నట్టా? లేనట్టా?
>> గౌడ్ ? ఎత్తుగడా? ప్రారబ్దమా?

రాష్ట్రాన్ని , రాష్ట్ర రాజకీయాన్నీ ఓ మలుపు తిప్పిన తెలుగు దేశం పార్టీ ఇహ ఉండబోదా? కేవలం చరిత్ర పుస్తకాల్లోనే దాని గురించి చదవాలా? లేక పునర్జన్మ తీసుకుంటుందా?

చంద్రబాబు చేసిన తప్పేమిటి? కార్యకర్తలను నిజంగా అన్యాయం చేశాడా? రైతులను నిజంగా అన్యాయం చేశాడా? చంద్రబాబు చేసినవి రాష్ట్ర భవిష్యత్తుకు మంచా? చెడా?

Saturday, June 28, 2008

రాజ శేఖరన్

రాజన్
రాజాధిరాజన్
మగరాజన్

రాజకీయ దురంధరన్
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

ఆ అంటే అందలాలు
ఆయ్ అంటే అరదండాలు!
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

అయినవారికి ఆకాశం, భూమీ!
కానివారికి కషాయం, కాలకూటం!!
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్

పీడకల
చీడపురుగు
ఓడయ్యే బండి
బండయ్యే ఓడ
రాజన్
రాజాధిరాజన్
మగ రాజన్
రాజ శేఖరన్

Monday, June 23, 2008

నక్షత్రాలు నవ్వుతూ నాట్యం చేస్తుంటాయి.

అక్కడ
నక్షత్రాలు నవ్వుతూ నాట్యం చేస్తుంటాయి.

అక్కడ
నవ్వుకు నవ్వు తప్ప మరో అర్థం లేదు.

ఇక్కడ
విషాద మేఘాలు నన్ను చుట్టుముట్టాయి.

ఇక్కడ
ద్వారాలన్నీ మూసి ఉన్నాయి.

ఇక్కడ,
పెదాలకు నవ్వు పూసుకొని నేనున్నాను.

ఇక్కడ,
నక్షత్రాలను లెక్కేస్తూ నేనున్నాను.

ఇక్కడ,
కన్నీరు బయటకు రానీకుండా గుండెలో చెలములు కట్టుకున్నాను.