Showing posts with label story. Show all posts
Showing posts with label story. Show all posts

Wednesday, October 1, 2008

మంచి దొంగ

రాయల వారి ఆద్వర్యంలో హంపిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అప్పటికే రాయలు వారు దున్నపోతును ఒక్కేటున బలిచ్చి సామంతుల నుండి బహుమతులు స్వీకరించడం వంటి కార్యక్రమాలు ముగించి నాట్యవినోదంలో మునిగిపొయ్యారు. నగరం మొత్తం అక్కడే ఉందా అన్పించేట్టు ఇసుక వేస్తే రాలనంతమంది పోగయ్యారు. సరిగ్గా అదే సమయంలో నగరంలో రెండు ప్రముఖ శెట్టిగార్ల భవనాలు దోపిడీకి గురయ్యాయన్న వార్త దానావాలంలా వ్యాపించింది. హంపి నగరంలో దొంగతనమా! అదీ ఒకే రోజు రెండు చోట్ల !! అంతా ముక్కున వేలేసుకున్నారు.
%%%%%%%%%%
అంతకు రెండు దినాల క్రితం దొంగల గుహ చాలా కోలాహలంగా ఉంది. ఆ రోజు దొంగల నాయకునికి వారసుని ఎన్నుకునే రోజు. అప్పటి వరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు సమ ఉజ్జీలుగా వచ్చారు. తమ నాయకుడు ఎవరిని విజేతగా ప్రకటిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు.
దొంగల నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో అప్పటివరకు కోలాహలంగా ఉన్న గుహ చాలా నిశ్శబ్దంగా మారిపొయింది.
"నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇప్పటివరకు జరిగిన అన్ని పోటీల్లోనూ కిన్నడు, తిన్నడు ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. అందుకని ఇంకో పోటీ --" అందరూ మరింత కుతూహలంగా వినసాగారు, తరువాతి పోటీ ఏమిటా అని.
"ఇదిగో ఇది హంపీ నగరంలో విరూపాక్షునికి శెట్టిగార్ల వీధి సమర్పించిన దాన వివరాల దస్త్రం. వీరిలో ఏదో ఒక ఇంటికి వెళ్లి సొమ్ములతో తిరిగి రావాలి."
%%%%%%%%%%%%%%%%%%%%
దసరా పండుగ ముగిసింది. దొంగల గుహ ఈ రోజు మరింత కోలాహలంగా ఉంది. అంతలో తిన్నడు తను తీసుకొచ్చిన బంగారు వరహాలు, నగలు, వజ్రాలు అన్నీ నాయకుని ఎదురుగా కుప్ప పోశాడు. గుహ మొత్తం సంతోషసూచకంగా ధ్వనులు. "విరూపాక్షునికి వెయ్యినొక్క వరహాలిచ్చిన గాజుల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు. నాయకుడు సంతోషంగా తలూపి కిన్నెడువైపు చూశాడు.
కిన్నెడు సైగ చెయ్యంగనే 16 మంది అనుచరులు బంగారు వరహాలు, వజ్రాలు, ఆభరణాలు పేద్ద గుట్టగా పోసారు. గుహ మొత్తం దద్దరిల్లింది.
"విరూపాక్షునికి ఒకే ఒక్క వరహా దానమిచ్చిన వరాల శెట్టి గారి బొక్కసం ఖాలీ!" అంటూ గర్వంగా నాయకునివైపు చూశాడు.
నాయకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. గుహలో మరోసారి నిశబ్దం ఆవరించింది.
"దొంగల నాయకునికి దొంగతనం చేసే జాగురూకతతో పాటు, ఎక్కడ సొమ్ములుంటాయో తెలుసుకునే తెలివితేటలు కూడా అవసరం. దొంగతనం చెయ్యడంలో తిన్నెడు, కిన్నెడూ ఇద్దరూ ఒకరికి మించిన వారు ఒకరు. కానీ కిన్నెడుకి ఎక్కడ దొంగతనం చెయ్యాలో కూడా తెలుసు. అతనే మీ నాయకుడు." అని ప్రకటించగానే గుహ మరోసారి దద్దరిల్లింది.

Monday, August 25, 2008

కవాకటి (Telugu Story) - A must Read.

పెదరాయుడుగారు సింహాసనంపై ఆసీనులై ఉన్నారు. అతని ఎదురుగా సామంతులు? సుందరాం, గ్యాంగద్, మానిక్ లు కూర్చోనున్నారు. ముగ్గురూ పెదరాయుడుగారు ఏం మాట్లాడతారో ఏమిటో అని ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

అందరిముందుకూ టీ, బిస్కోట్లు తెచ్చి బాయ్స్ నిష్క్రమించిన దాకా ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అంతా నెమ్మదిగా టీ తాగుతూ బిస్కోట్లు తింటూ గోడమీద స్క్రీన్పై ప్రొజెక్ట్ చేసిన దాన్ని గమనించసాగారు.

కవాకటి

వార్షిక రిపోర్ట్

అని స్క్రీన్ పై ప్రొజెక్ట్ చెయ్యబడింది.

పెదరాయుడు గారు కుషన్ కుర్చీలో ఇంకొంచెం సుఖం కోసం సర్దుకొని కూర్చొని మాట్లాడటం మొదలు పెట్టాడు.

"ఫ్రెండ్స్! సంవత్సరం ముగిసింది. ఒక్కసారి ఏం జరిగిందో తరచి చూసుకొని కొత్త సంవత్సరాన్ని ఎలా మలచుకోవాలో చూద్దాం. ముందుగా గుడ్ న్యూస్ తో మొదలుపెడదాం" అంటూ తరువాతి స్లైడ్ కి వెళ్లాడు. స్లైడ్ చూస్తూ మాట్లాడటం కొనసాగించాడు.

ఈ సంవత్సరం మన రెవిన్యూ 60 కోట్లు. రూంలోని మిగిలిన ముగ్గురూ చప్పట్లు కొట్టారు. పెదరాయుడు గారు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉండి తరువాత స్లీడ్ కి వెళ్లారు.

కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే మనం ఈ సంవత్సరం రెవిన్యూ 100 కోట్లగా టార్గెట్ పెట్టుకున్నాం, దానికి చాలా దూరంలో ఆగిపొయినాము.

ఈ సారి ముగ్గురూ సీరియస్ గా స్లైడ్ చూడసాగారు. పెదరాయుడువైపెవరూ చూడలేదు.

కానీ మరో గుడ్ న్యూస్! అంటూ తరువాతి స్లైడ్ కి వెళ్లాడు. అందులో వివిధ నగరాల పేర్లూ వాటి పక్కన రెవిన్యూ వివరాలు ఉన్నాయి.

మిగిలిన నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ చాలా ముందుంది. ఆ తరువాత 40 కోట్లతో డిల్లీ రెండో స్తానంలో ఉంది.

ఇలా అని తరువాత స్లైడ్ కి వెళ్లబోతుంటే గ్యాంగద్ మాట్లాడాడు.

"అంటే మన టార్గెట్ లు మరీ అన్ రియలిస్ట్ క్ గా పెట్టుకున్నామేమో?"

చాలా మంచి ప్రశ్న మన తరువాతి స్లైడ్ లో దానికి కొంతవరకూ సమాధానం ఉండోచ్చు. నిజానికి మన టార్గెట్లు కష్టమైనవే కానీ పూర్తిగా అన్ రియలిస్ట్ క్ కాదు. మొత్తం హైదరాబాదులో ప్రజలు కూరగాయలుపై పెట్టే ఖర్చు 350 కోట్ల రూపాయలు. దానిలో మన టార్గెట్ కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే!

ఏదేమైనా మిమ్మల్ని మీ కష్టాన్ని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. మనం చాలా కష్టపడ్డాం. అందరి కంటే ముందంజలో నిలిచాం> దిసీజ్ సంథింగ్ టూ సెలబ్రేట్ అంటూ తరువాత స్లైడ్ కి వెళ్లాడు.

ఈ స్లైడ్ పూర్తిగా మానిక్ కే చెందుతుంది. మన మార్కెటింగ్ హెడ్ గా మానిక్ అధ్బుతమైన పెర్ఫామెన్స్ కనపర్చాడు. నగరంలో మన షాప్ ఓపెన్ అవ్వడానికి ముందే మీడియాలో అధ్భుతమైన క్రేజ్ తెచ్చి పెట్టాడు. ఎక్కడా నెగటివ్ పబ్లిసిటీ రాకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు.

ఈ విషయంలో మన హైదరాబాద్ టీం దేశానికే ఆదర్శం.

ఆ తరువాత కూడా అత్యంత తక్కువ బడ్జెట్ తో మంచి పబ్లిసిటీ డిజైన్ చేశాడు.

అందరూ చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తపరచారు. పెదరాయుడు కూడా వారితో జతకలిశాడు.

ఈ స్లైడ్ మన సుందరాం క్రెడిట్. ఐయేయస్ నుండి నేనతన్ని హైర్ చేసినప్పుడు కొంతమంది అభ్యంతరం చెప్పారు. కానీ సుందరాం నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మనకు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కానీ, ఇల్లీగల్ గా కూరలు అమ్ముతూ మన వ్యాపారాన్ని క్రబ్ చేయడంలో కానీ ఇంకా అనేకానేక విషయాల్లో అద్భుతమైన ఫెర్ఫామెన్ కనపర్చాడు. ఇతని విజయాల్లో నాకు నచ్చినది చాలా కూల్ గా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న రెండు వందలపైబడి ఇల్లీగల్ వెండార్స్ ని మనకి నష్టం కలిగించకుండా చెయ్యడం ఈ విషయంలో ఇతను మీడియా, పోలీస్, పొలిటికల్ అన్ని సర్కిల్లలో తన పలుకుబడి పాజిటివ్ గా ఉపయోగించుకున్నాడు. కూడోస్ టూ సుందరాం.

అందరూ ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టారు.

ఈ స్లైడ్ క్రెడిట్ గ్యాంగద్. గ్యాంగద్ మన దగ్గరకు పెద్ద ఐటీ కంపెనీ నుండి వచ్చాడు. ముందుగా సాఫ్ట్ వేఋ ఇండస్ట్రీ నుండి మన కూరగాయల వ్యాపారానికి రాడానికి ఒప్పుకున్నందుకు గ్యాంగద్ కు చాలా థాంక్స్.



గ్యాంగద్ కొంచెం సిగ్గు పడ్డాడు.

ఇతను సృజనాత్మకంగా డిజైన్ చేసిన వివిధ స్కీములతో మన సేల్స్ ఒక్కొక్క రోజు రెట్టింపయ్యాయంటే అతిశయోక్తి కాదు. అన్నింటికంటే నా ఫేవరెట్ మూడు కేజీలు బీరకాయలు కొంటే కేజీ పొట్లకాయలు ఫ్రీ. నేనయితే అస్సలు నమ్మలేదు బీరకాయలు నచ్చిన చాలా మందికి పొట్లకాయలు కూడా నచ్చుతాయని గ్యాంగద్ ప్రోగ్రాం చెప్పినప్పుడు.

అందరూ గట్టిగా నవ్వుతూ తప్పట్లు కొట్టారు. గ్యాంగద్ ఇంకొంచెం సిగ్గు పడ్డాడు.

ఒక్కసారి ఎం బాగా జరగలేదో చూద్దాం.

మనం మన 100 కోట్లు టార్గెట్ చేరుకోకపోవడానికి ప్రధాన కారణం రైతు బజార్ లు. ఒక్క హైదరాబాద్ లోనే అవి 150 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.

రెండో కారణం చాలా సార్లు మన దగ్గరకు వచ్చే కస్టమర్ లు కావల్సినవి మన షాపుల్లో ఆసరికే నిండుకోవడం.

మూడో కారణం రకరకాల కారణాల వల్ల మనం ధరలు తక్కువగా ఉంచాల్సి రావడం.

నాలుగో కారణం మనం కేవలం 300 షాపులే ఓపెన్ చెయ్యడం. 500 షాపులు మన టార్గెట్!!

(సషేషం_)
(అయిపోయింది.)