రాష్ట్రంలో అవినీతిదే ప్రదమ స్థానం
కేపీహెచ్‌బీకాలనీ, ఆన్‌లైన్: తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా యువత సమర శంఖం పూరించడం హర్షించదగ్గ పరిణామమని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కేపీహెచ్‌బీకాలనీలోని ఐమాక్స్ గార్డెన్స్‌లో భారీ సదస్సును నిర్వహించారు. అంతకు ముందుకు వివిధ రంగాలకు చెందిన యువ ఇంజనీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సుకు పేర్వారం రాములు ముఖ్య అతి«థిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే అవినీతి ముందంజలో ఉందని విమర్శించారు. బందుగణం, అనుచరుల ద్వారా వైఎస్ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో కింది స్థాయి ఉద్యోగులే బలవుతున్నారు తప్ప ఉన్నతస్థాయిఅధికారులు, రాజకీయ నాయకులు పట్టుబడ్డ దాఖలాలు మాత్రం లేవన్నారు. ఉగ్రవాదంతో పాటు లా అండ్ అర్డర్ విషయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఫోర్ సాఫ్ట్ అధినేత శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ఓటు అనే ఆయుధంతో యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చి టీడీపీని తిరిగి అధికారంలోకి తెస్తామని యువ ఇంజనీర్లు ప్రతిజ్ఞ చేశారుnews source andhrajyothy
No comments:
Post a Comment