Showing posts with label andhra politics. Show all posts
Showing posts with label andhra politics. Show all posts

Wednesday, October 22, 2008

రాజశేఖర రెడ్డి కుల రాజకీయాలు

మొన్నీమద్య గౌడ కుల పెద్దలు
ఈ రోజు స్వర్ణకారులు

ఇలా రోజుకో కులాన్ని పిలిపించుకోటం, అదీ ఇదీ చెప్పటం, చివరకు డైరక్టుగానో ఇండైరెక్టుగానో వోటు బ్యాంకు సృష్టించుకోవాలని చూడటం.

కులమా నీ చావెప్పుడే?

కుల దుర్వినియోగమా నీ చావెప్పుడేఁ?

Tuesday, October 7, 2008

తెలుగు సినిమా తన సామాజిక భాద్యత నుండి తప్పుకుందా?

రైతుల ఆత్మ హత్యలు
సెజ్ లు భూ పోరాటాలు
నేత కార్మికుల ఆత్మ హత్యలు
ఇలా పలు విషయాలు రాష్ట్ర ప్రజానికాన్ని బాదిస్తున్నా, కనీసం ఒక్క సినిమా కూడా ఒక్కటంటే ఒక్క సామాజిక అంశంపై కూడా తియ్యలేదు.
అన్నిటికంటే దారుణ విషయం ఈవీవీ ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకున్న రైతు నుండి కూడా కామెడీ పిండటం.
ఎంత మంచి సినిమాలు తియ్యవచ్చు, ఎంత ధైర్యం కల్గించవచ్చు, ఎంత మార్పు తీసుకు రావచ్చు.
నారాయణ మూర్తి లాంటోల్లు మల్లా కావాలి.

Monday, September 29, 2008

తెదేపా మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు

అడ్డులేని అవినీతి.. అంతులేని అశాంతి
చేతకాని ప్రభుత్వాలివి
మండిపడ్డ తెదేపా
మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు
కె.పి.హెచ్‌.బి.కాలనీ, సెప్టెంబరు 28 (న్యూస్‌టుడే): దేశ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్‌ ఢిల్లీలో ఓ జోకర్‌లా తయారయ్యారని రాష్ట్ర మాజీ డీజీపీ, తెదేపా నాయకుడు పేర్వారం రాములు విమర్శించారు. తెదేపాకు మద్దతుగా మనకోసం తెలుగుదేశం అంటూ యువ ఇంజనీర్లు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాత రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి తాబేదార్లకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం అంగుళం భూమి కూడా మిగలని హెచ్చరించారు. సెజ్‌ల పేరుతో పేదల భూమిని పెద్దలకు దోచిపెడుతోందన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిపై కొరడా ఝళిపించే ప్రభుత్వం ఐఎఎస్‌, ఐపిఎస్‌ల స్ధాయిలో జరిగే అవినీతిని మాత్రం అసలు పట్టించుకోవడంలేదని రాములు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రలో శాంతిభధ్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయని విమర్శించారు. సదస్సు ఏర్పాటు చేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకున్నట్టే మనరాష్ట్రాన్నికూడా చేతకాని ప్రభుత్వం నుంచి మనమే ప్రస్తుతం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఐటీ విప్లవం తెదేపా వల్లే జరిగిందన్నారు. శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా తెదేపా వల్లే జరుగుతుందన్నారు. ఐటి నిపుణుడు సతీష్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారికి ఐటి రంగంలో గుర్తింపును చంద్రబాబు తెచ్చారన్నారు. సదస్సులో యువ ఇంజనీర్లు తెదేపా చేట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిని స్త్లెడ్స్‌ ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మేలుకో యువత, కాపాడుకో రాష్ట్రభవిత వంటి నినాదాలతో హోరెత్తించారు. ఇంటిలోని ప్రతిఒక్కరూ తమోటుహక్కును వినియోగించుకోవడంతోపాటు కుటుంబసభ్యులందరినీ ఓటుహక్కు వినియోగించుకోనేలా చూడాలని కోరారు.

source eenaadu Hyd district news.

మన కోసం తెలుగు దేశం ఫోటోలు


ఆడిటోరియం అలంకరణ
పెద్దలు




జ్యోతి ప్రజ్వలన
వ్యాఖ్యాత
పిన్నలు
నామా నాగేశ్వరరావు గారు
శ్రీనివాస రెడ్డి గారు
నాసా వేత్త


హాల్ ఫుల్ (ఆల్మోస్ట్) ఓ వెయ్యి మంది వరకూ వచ్చారు అని అంచనా.

పిన్నలు
అన్నగారి ఆశీర్వాదాలు


ఐటీ రకతం

Sunday, September 28, 2008

టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌

రాష్ట్రంలో అవినీతిదే ప్రదమ స్థానం

కేపీహెచ్‌బీకాలనీ, ఆన్‌లైన్‌: తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా యువత సమర శంఖం పూరించడం హర్షించదగ్గ పరిణామమని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కేపీహెచ్‌బీకాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో భారీ సదస్సును నిర్వహించారు. అంతకు ముందుకు వివిధ రంగాలకు చెందిన యువ ఇంజనీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సుకు పేర్వారం రాములు ముఖ్య అతి«థిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే అవినీతి ముందంజలో ఉందని విమర్శించారు. బందుగణం, అనుచరుల ద్వారా వైఎస్‌ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో కింది స్థాయి ఉద్యోగులే బలవుతున్నారు తప్ప ఉన్నతస్థాయిఅధికారులు, రాజకీయ నాయకులు పట్టుబడ్డ దాఖలాలు మాత్రం లేవన్నారు. ఉగ్రవాదంతో పాటు లా అండ్‌ అర్డర్‌ విషయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఫోర్‌ సాఫ్ట్‌ అధినేత శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ఓటు అనే ఆయుధంతో యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చి టీడీపీని తిరిగి అధికారంలోకి తెస్తామని యువ ఇంజనీర్లు ప్రతిజ్ఞ చేశారు

news source andhrajyothy

Friday, September 26, 2008

ఎవరిది త్యాగం?

ఈ మధ్య ఎవరో అంటున్నారు.

అతెలంగాణా జనాలు త్యాగ మూర్తులు అని. వారు అన్నీ కోల్పోతున్నా, తెలంగాణా వాళ్లు అవమానిస్తున్నా, భరిస్తూ కేవలం రాష్ట్రం కలిసి ఉంటే చాలు అని అన్ని త్యాగాలూ చేస్తున్నారు అని.

నా ఉద్దేశ్యంలో అసలు త్యాగ మూర్తులు తెలంగాణా వారే.

దళితులకు జరిగినట్టు అడుగడుగునా అవమానం జరుగుతున్నా భరిస్తూ ఏదోలే మన తెలుగు వాడే కదా అని కలిసి ఉంటున్నందుకు తెలంగాణా వాళ్లే పేద్ద త్యాగ మూర్తులు.

హైదరాబాదులో ఓ చిన్న బాబు కి వాళ్లమ్మ రోడ్డుపై దర్జాగా చెప్పే మాట "మనం అలా చెప్పిండ్రు అని అన కూడదు. చెప్పాడు అనాలి" (సరిగ్గా గుర్తు లేదు కానీ ఇటువంటి మాటే ఏదో)

ఏ తెలంగాణా వాడన్నా అతెలంగాణా విధ్యా సంస్థలో చేరితే ముందు భాషను అవమానిస్తుంటే భరించడం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరికన్నా తెలంగాణాలో జరిగిందా? అయినా ఎందుకు కలిసి ఉంటున్నారు? ఎందుకంటే మెజార్టీ తెలంగాణా జనాలు త్యాగ మూర్తులు కాబట్టి.

అసలు మెజార్టీ తెలంగాణా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఎప్పుడో వచ్చేది. కేవలం తెలంగాణా ప్రజల సమైఖ్య రాష్ట్ర కాంక్ష వల్లనే ఇంకా రాష్ట్రం కలిసి ఉంటుంది.

ఈ సారి ఎప్పుడన్నా ఎవడి బాసనన్నా ఎక్కిరించేముందు, పల్లీలంటారు, గాడిద గుడ్డంటారు, అని అనే ముందు ముందు చూపుతో ఆలోచించండి.

Thursday, September 18, 2008

మా తాత గురించి చరిత్ర పుస్తకంలో లేదేమిటి?

కరడు కట్టిన గుడ్డి తెలంగాణా వాది మన నవీన్ ఆచారి గారు బ్లాగు మొదలుపెట్టారు. వివిధ పత్రికలు మొన్నగు చోట్ల తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన వ్యాసాలు కాపీ పేస్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడూ తన కీబోర్డుకు కూడా పని చెపుతూ ఉంటారు. వారి బ్లాగుకు స్వాగతం.

అనుభవ పూర్వకంగా నేర్చుకున్నదేమిటంటే కొన్ని బ్లాగులపై కామెంటడం దండగ! దాని బదులు మరో బ్లాగులో రాసుకోవడం శుభ్రం. అటువంటి వాటిలో తాబాసు గారి బ్లాగు కూడా ఒకటి అనుకోండి. కాకపోతే ఆ విషయాన్ని ఆయన హుందాగా కామెంటే ముందే ఎర్ర అక్షరాలతో వ్రాశారు. నెనర్లు :)

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి

ఈ వ్యాసంలో ఇలా ప్రశ్నించారు కదా, దీనిని సమాధానం నవీన్ ఆచారి గారి దగ్గర లేదంటారా? ఉంది కానీ చూడటం ఇష్టంలేదు. ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

పీవీ నరసింహ రావు గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టినట్టు? వారిది తెలంగాణా కాదా?

ప్రకాశం పంతులు ఉదాహరణ ఇచ్చారు, అతన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి కారణం కాంగ్రేస్ వాది అనే కానీ, కోస్తా వాడు అనో, తెలంగాణా వాడు కాదు అనో నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

రైతాంగ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు? కారణాలు నవీన్ ఆచారికి తెలీదా?
1. ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు అనీ (లేకపోతే వారి వోట్లు పోతాయని)
2. వివాదాస్పదమైన విషయం అనవసరంగా గెలుక్కోవడం ఎందుకనీ

అంతే కానీ అది తెలంగాణాలో మాత్రమే జరిగిందనీ, కోస్తాలో జరగలేదని కాబట్టి పఠ్యపుస్తకాల్లో పెట్టలేదనే విషయం నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పుకున్నట్టు "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది".

అన్నట్టు దున్నపోతు ఈనిందంట తెలుసా?

తెలుసు ఇదంతా కోస్తా వాళ్ల కుట్ర. ప్రత్యేక తెలంగాణా కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవం కావాలి, అప్పుడే తెలంగాణాలో దున్నపోతులు ఈనకుండ ఉంటాయి. అని చెపుతారు ఈ కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాదులు.

శుభం.