సెమార్గ్ (కవాకటి)
పెదరాయుడు గారు తన ఎదురుగా కూర్చున్న సుందరాం, గ్యాంగద్ ల వైపు
మరోసారి చూసి టీ త్రాగడం అయిపోచేసి ఇహ మొదలు పెట్టండి అన్నట్టు
చూశాడు.
ముందుగా సుందరాం మొదలుపెట్టాడు. "ఈ సంవత్సరం మొదటి మూడు నెళ్లు ఇట్టే
గడిచిపొయ్యాయి. మొన్న మొన్ననే మన మొదటి సంవత్సరం మీటింగ్ లో
కూర్చున్నట్టుంది. ఈ మూడు నెళ్ల ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి.
నిజాలు చేదుగా ఉన్నా చెప్పుకోవాలి కదఈ కదా!
ఈ మూడు నెళ్ల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇలాగే
కొనసాగితే మనం టార్గెట్ చేరుకోవడం అటుంచి కనీసం పొయిన సంవత్సరం
వచ్చిన ఆదాయం కూడా రాకపోవచ్చు".
గ్యాంగద్ తల వంచుకొని తన లాప్టాప్ వైపు చూడసాగాడు. పెదరాయుడు
మొఖంలో ఎటువంటి భావాలూ లేవు.
సుందరాం మాట్లాడటం కొనసాగించాడు.
"సమస్యల మీద సంస్యలు!
మనం ఒప్పందం చేసుకున్న ప్రాంతంలో వరదలవల్ల దిగుబడి తగ్గింది.
వెరే చోటనుండి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. గోరు చుట్టమీద
రోకటి పోటులా మనం ఒప్పందం చేసుకున్న రైతులు ఎక్కువ ధర, ఇన్సూరెన్స్
మొన్నగు 14 విషయాల గురించి పోరాడుతున్నారు.
కాంపిటీషన్! మన దారిలో ఇంకో ముగ్గురు కూడా హైదరాబాద్ నిండా షాప్
లు ఓపెన్ చేశారు. అయితే వీటన్నిటికంటే పెద్ద పోటీ రైతు బజార్ల నుండి
వస్తుంది. ఇప్పటికీ మన హైదరాబాద్ కూరగాయల అమ్మకాల్లో మెజార్టీ
వాటా రైతు బజార్లదే!
వేస్టేజ్!! మొత్తం 20% వరకూ మనం కొన్న కూరగాయలు వేస్ట్ అయ్యాయి.
మొత్తం దృష్టిలోకి వచ్చిన సమస్యలన్నీ ఈ పీపీటీ లో ఉన్నాయి. పైన
చెప్పిన మూడూ మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన వాటిలో ముఖ్యమైనవి."
.......................
అప్పటికీ పెదరాయుడు ఏమీ మాట్లాడలెదు. మొఖంలో ఏ భావాలూ లేవు.
నింపాదిగా గ్యాంగద్ వైపు చూశాడు.
గ్యాంగద్ గొంతు సవరించుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు.
"ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మొహంపై ఏసీ గాలి తగిలే చోట ఉన్న
కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతున్నట్టు తేలింది. మన వాళ్లు దీన్ని
ఉపయోగించుకొని వేస్టేజ్ కొంత వరకు తగ్గించుకోవచ్చనుకుంటాను. "
పెదరాయుడు, సుందరాం లు తల ఊపారు. ఇంకా ఏమన్నా మాట్లాడతాడేమో
అని ఎదురు చూశారు. గ్యాంగద్ కొంచెం సేపు తనలో తాను ఆలొచించుకొని
నా దగ్గరో ఐడియా ఉంది. అంటూ మొదలుపెట్టాడు.
"మన నగర పరిసరాల్లో నుండే కూరగాయలు హైద్ కి ఎక్కువగా
వస్తుంటాయి. అయితే వీటిని ఎక్కువగా మురికి నీటితో పండిస్తున్నారు. లేదా
కనిపించడానికి నీళ్లు బాగానే ఉన్నా హైద్ కెమికల్స్ కలిసిన నీటితో
పండిస్తున్నారు. వీటి వల్ల ఆ కూరగాయలు ఎక్కువగా
అనారోగ్యకరమైనవి.
వీటికి సమాధానంగా ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ అది
కేవలం అత్యున్నత వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉంది. మధ్య
తరగతికి ఏది ఆరోగ్యకరమైనదో , ఏది అనారోగ్యకరమైనదో తెలీదు.
మనకి ఇక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే మనం కృష్ణా,
గోదావరి, గంగా, యమున వంటి నదుల స్వచ్చమైన నీటితో పండించిన
కూరగాయలు మాత్రమే అమ్ముతామన్న మాట. వీటిని సెమీ ఆర్గానిక్ ఫుడ్
లేదా సింపుల్ గా సెమార్గ్ అని పిలవొచ్చు. వీటివల్ల మనకి
కాంపిటీటర్లపై ఎడ్వాంటేజ్ వస్తుంది. రైతు బజార్ ల నుండి
మధ్యతరగతిని మరీ ముఖ్యంగా నవీ మధ్య తరగతిని వేరు చెయ్యవచ్చు. "
------
పెద రాయుడు, సుందరాం ల కళ్లలో ఓ మెరుపు మెరిసింది. ఆ ఐడియాకున్న
వాల్యూ వాళ్లిద్దరికీ వెంటనే అర్థం అయింది. వరదలో చిక్కుకున్న
వారికి ఆసరా దొరికినట్టయింది.
-------
ఆ రూంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. పెద రాయుడు, గ్యాంగద్, సుందరాం
లతో పాటు మరో మూడు కొత్త మొఖాలు ఉన్నాయి.
" ఈ ఐడియా పంజేస్తుందంటావా?" ఓ కొత్త మొఖం ప్రశ్నించింది.
"బంగారంలా! మన వాళ్లు తెలివైన వాళ్లే కానీ, మరీ అంత తెలివైన
వాళ్లు కాదు. ఇంకో ముక్కలో చెప్పాలంటే తెలివైన వాళ్లు అనుకుంటారు. "
అప్పటికీ ఆ కొత్త మొహంలో ఎటువంటి శాటిస్ ఫ్యాక్షన్ కంపించలేదు.
సుందరాం ఆ మొహం చూసి మాట్లాడటం కొనసాగించాడు.
"అక్కడి దాకా ఎందుకు, మన కేస్ స్టడీ ఫైవ్ చూడండి. లవర్ కారం
వాళ్లు మార్కెట్లోకి వచ్చే నెల రోజుల ముందు విజయవాడ, గుంటూరు లలోని
కారం ఫ్యాక్టరీల గురించి తమ పెపర్లో అన్నీ నిజాలే వ్రాశారు. ఆ
తరువాత వాళ్లు రిలీజ్ చేసిన లవర్ కారం మెజార్టీ వాటా చాలా
సులువుగా పొందింది."
అప్పటికీ కొత్త మొహంలో కొంత శాటిస్ ఫ్యాక్షన్ కంపించింది. మరింగ డ్రాగ్
చెయ్యడం ఇష్టం లేనట్టు అంగీకార సూచకంగా తల ఊపాడు.
సుందరామే మాట్లాడసాగాడు. "ముందుగా అనుకున్నట్టే మనం ఈ
అనారోగ్యకర పంటలపై చేస్తున్న పరిశోధనలకు మన మన సబ్ యూనిట్ల
నుండి ఫైనాన్స్ చెయ్యాలి. ఆ తరువాత వాటి గురించి ప్రపంచ
వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యేట్టు చూడాలి. ఆ తరువాత
సరి అయిన సమయంలో మన సెమార్గ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చెయ్యాలి. చాలా
పాజిటివ్ గా ప్రచారం చెయ్యాలి. నిజానికి ఇది మనకు కత్తి మీద
సాము. తస్మాత్ జాగురూకతతో ముందుకు వెళ్లాలి."
గ్యాంగద్ ఆసక్తిగా ఈ విషయాలన్నీ గమనించసాగాడు. తను ధైర్యం
చేసి చెప్పిన ఐడియా ఇంత మూమెంట్ ఇంత తొందరగా క్రియేట్
చేస్తుందనుకోలేదు.
------------------
ఆ రూంలో మొత్తం పది మంది ఉన్నారు. సుందరాం, గ్యాంగద్, పెదరాయుడు
లతో పాటు మరో ఏడుగురు కొత్తోళ్లు ఉన్నారు. మొత్తం రూంలో పండుగ
వాతావరణం నెలకొంది. అందరి మొహాల్లోనూ ఆనందం ఆనందతాండవం
చేస్తుంది. పెద రాయుడు గారు గొంతు సవరించుకొని మాట్లాడటం
మొదలుపెట్టాడు.
"ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది వ్యక్తులకే కాదు
సంస్తలకూ వర్తిస్తుంది. 9 నెళ్ల క్రితం ఈ రూంలో వాతావరణం ఇలా
లేదు. కానీ ఆ రోజు గ్యాంగద్ ఇచ్చిన ఆలొచనతో మన వాళ్లు
అద్భుతమైన ఆచరణతో ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాం. మన టార్గెట్ కంటే
మూడింతలు ఎక్కువాగా మన రెవిన్యూ వసూలయింది! " అందరూ చప్పట్లు కొట్టి
తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
" మన హైద్ వారి అడుగు జాడల్లో మిగిల్న నగరాల వాళ్లు కూడా
ముండడుగు వేయడం మనందరికీ గర్వ కారణం.
ఈ రెవిన్యూలో సగం మన ప్యాకేజ్డ్ వెజిటెబుల్స్ హైద్ వెలుపల గ్రామాలు,
పట్టణాల్లో సాధించిందే! ఇలా చూస్తే మన వాళ్లు అంటార్కిటికాలో
మంచు అమ్మ గలరనిపిస్తుంది!"
అందరూ ఒకటే నవ్వులు.
"మరిన్ని వివరాలతో మిమ్మళ్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. LET THE
CELEBRATION BEGIN!"
Friday, September 5, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
Post a Comment