Tuesday, October 7, 2008

ఇంకా ఈనాడే నంబర్ వన్నా?

ఎప్పుడు 10 తరువాత కొందామన్నా ఈనాడు దొరకటంలేదు. అదే సాక్షి , ఆంధ్ర జ్యోతి, ... అయితే దిగాలుగా అలా పాన్ షాపుల ముందు వేలాడి కొనే వాల్లు ఉన్నారా అని ఎదురుచూస్తున్నట్టు ఉంటాయి.
ఈనాడు వాడు తక్కువ పేపర్లు పంపుతున్నాడా? లేక ప్రజలు ఇంకా అదే కొంటున్నారా?
సాక్షి హిట్టా? ప్లాపా?
అసలీ పేపర్ల అమ్మకాలు మనకి తెలిసే మార్గం ఏమన్నా ఉందా?

3 comments:

Ramani Rao said...

సాక్షి పబ్లిసిటీ పెరిగిందిగా అందుకే పోటిగా ఈనాడు కొంటున్నారేమో జనాలు. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, అందరూ నడిచిన దారిలో నేను నడవను అన్నట్లుగా ఎవరికి వారే, సాక్షి పేపర్ కొనకుండా ఈనాడు కొని జనాధరణా, రామోజి రావు ఖజాన నింపే ప్రయత్నంలో పడ్డారేమో! మాకు పేపర్ ఇంటికొస్తుంది కాబట్టి ఈ హంగామా తెలియడం లేదు.

చైతన్య.ఎస్ said...

మీకొచ్చిన అనుమానం నాకు చాలా రోజుల నుంచి ఉంది. మరి తీరే దారి ఏది. హిట్టా ? ఫ్లాపా ?

చిలమకూరు విజయమోహన్ said...

చదివేవాళ్ళకు ఫట్టు,పాతపేపరువాళ్ళకు హిట్టు...