Sunday, September 28, 2008

మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత

రాష్ట్రంలో ఐటీ ఆద్యుడు చంద్రబాబే
ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం
ఇంజినీర్ల మద్దతు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''ఐటీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇంత గుర్తింపు లభిస్తోందంటే అందుకు తెదేపా అధినేత చంద్రబాబే కారణం. మళ్లీ ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం'' అని యువ ఇంజినీర్లు పేర్కొన్నారు. ఊరూరా తిరిగి ఆయన పాలనా దక్షతను చాటిచెప్పాలని నిర్ణయించారు. 'మన కోసం తెలుగుదేశం', 'మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత' సందేశంతో ఆదివారమిక్కడి ఐమాక్స్‌ గార్డెన్‌లో ఇంజినీర్లు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ''చంద్రబాబు పదేళ్ల కిందట ఐటీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హైటెక్‌ సిటీ నిర్మిస్తుంటే అది భూత్‌బంగ్లా అని విమర్శించారు. నాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబు ఉన్నతాధికారులతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తే ఎద్దేవా చేశారు'' అని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని సదస్సులు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అక్రమార్జన: పేర్వారం
కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులు అక్రమార్జనలతో స్విస్‌ బ్యాంకులో పెద్ద ఎత్తున సొమ్ము దాచుకుంటున్నారని సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీజీపీ పేర్వారం రాములు ఆరోపించారు. వారిని వదిలేసి చిన్నమొత్తంలో లంచాలు తీసుకుంటున్న చిరు ఉద్యోగులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. సెజ్‌ల పేరిట భూములను ధారాదత్తం చేసుకుంటూపోతే రాష్ట్రంలో సెంటు భూమి మిగలదని చెప్పారు.


news from eenadu.net


related links:

http://groups.google.com/group/manakosamtelugudesam


http://www.manakosam-telugudesam.blogspot.com/

No comments: