Friday, September 26, 2008

ఎవరిది త్యాగం?

ఈ మధ్య ఎవరో అంటున్నారు.

అతెలంగాణా జనాలు త్యాగ మూర్తులు అని. వారు అన్నీ కోల్పోతున్నా, తెలంగాణా వాళ్లు అవమానిస్తున్నా, భరిస్తూ కేవలం రాష్ట్రం కలిసి ఉంటే చాలు అని అన్ని త్యాగాలూ చేస్తున్నారు అని.

నా ఉద్దేశ్యంలో అసలు త్యాగ మూర్తులు తెలంగాణా వారే.

దళితులకు జరిగినట్టు అడుగడుగునా అవమానం జరుగుతున్నా భరిస్తూ ఏదోలే మన తెలుగు వాడే కదా అని కలిసి ఉంటున్నందుకు తెలంగాణా వాళ్లే పేద్ద త్యాగ మూర్తులు.

హైదరాబాదులో ఓ చిన్న బాబు కి వాళ్లమ్మ రోడ్డుపై దర్జాగా చెప్పే మాట "మనం అలా చెప్పిండ్రు అని అన కూడదు. చెప్పాడు అనాలి" (సరిగ్గా గుర్తు లేదు కానీ ఇటువంటి మాటే ఏదో)

ఏ తెలంగాణా వాడన్నా అతెలంగాణా విధ్యా సంస్థలో చేరితే ముందు భాషను అవమానిస్తుంటే భరించడం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరికన్నా తెలంగాణాలో జరిగిందా? అయినా ఎందుకు కలిసి ఉంటున్నారు? ఎందుకంటే మెజార్టీ తెలంగాణా జనాలు త్యాగ మూర్తులు కాబట్టి.

అసలు మెజార్టీ తెలంగాణా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఎప్పుడో వచ్చేది. కేవలం తెలంగాణా ప్రజల సమైఖ్య రాష్ట్ర కాంక్ష వల్లనే ఇంకా రాష్ట్రం కలిసి ఉంటుంది.

ఈ సారి ఎప్పుడన్నా ఎవడి బాసనన్నా ఎక్కిరించేముందు, పల్లీలంటారు, గాడిద గుడ్డంటారు, అని అనే ముందు ముందు చూపుతో ఆలోచించండి.

4 comments:

Anil Dasari said...

కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.

రాధిక said...

నాకర్ధం అయింది.కానీ ఒక్క విషయం సినిమాల్లో అదీ ఆంధ్రా యాసని కమెడియన్స్ వాడుతూవుంటారు.కానీ ఏ గోదావరి జిల్లాల వాళ్ళూ గోల చెయ్యలేదే?రాయలసీమ యాసను విలన్లకు వాడతారు.వాళ్ళూ ఏమీ అనట్లేదే.మరి ఒక్క తెలంగాణా వాళ్ళకే ఎందుకంత బాధ.తెలంగాణా భాషని వెక్కిరిస్తున్నారు అంటున్నారు.గోదావరి జిలాల వాళ్లని[ఆ యాసలో మాట్లాడేవాళ్లని] ఎంత గా అవమానిస్తారో మీకు తెలియలేదా?స్వయం గా అనుభవించాను నేను.నాలాంటివారెందరో.అయినా వాళ్లెవరూ మమ్మల్ని అవమానించేస్తున్నారని ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగలేదే.

Naga said...

yet another Telugu guy!

Krishna K said...

ఇంకో ప్రాంతం వాళ్ల భాషను/యాసను ఎగతాళి చేయటం అనేది universal. రాష్ట్రం లో చాలా ప్రాంతాలు చదువుకోనే రోజులలో తిరిగినవాడిగా నా అనుభవాలు చెబ్తాను చూడండి. ఇవి చదివిన తరువాత మీరు ఇందులోకి తెలంగాణను లాగడం ఎంతవరకు సబబొ అలోచించండి.
1. Intermediate లో నెల్లూరు వెళ్లి క్లాస్ లో, విజయవాడ లో అన్నట్లు మాస్టారు అని ఎదో doubt అడిగితే క్లాస్ క్లాస్ అంతా (అమ్మాయలతో) సహా పడి పడి, నవ్వారు. అక్కడ మాస్టారు అనేది వాళ్లు ఎప్పుడూ వినలేదు. సార్ అనే పిలుస్తారు.
2. ప్రకాశం జిల్లా లో కొన్ని రోజులు ఉండి, విజయవాడ వెళ్లి 'ఏంది రా ' అంటే, అక్కడ తెగ ఎగతాళి చేసారు, ఆ ప్రాంతం లో, 'ఏంటి రా' అనే అంటారు.
3. క్రిష్ణా జిల్లలో నే, జగ్గయ్య పేట ప్రాంతానికి (పెనుగంచిప్రోలు చుట్టుప్రక్కల) వెళ్లి, 'పరుగెత్తరా' అంటే అక్కడ స్కూల్ స్కూల్ మొత్తం నవ్వారు. ఆ ప్రాంతం లో, 'ఉరుకు, ఉరుకు ' అంటారు.
4. ఇంక రాధిక గారు ఇప్పటికే చెప్పినట్లు, తూ.గో.జి. వాళ్ల యాస మాట్లాడితే ఆ ప్రాంతం లో తప్ప మిగతా ప్రాంతాలలో ఎగతాళి చేయని వాళ్లు ఎవరు?
5. రాయలసీమ వాళ్లు ముఖ్యం గా, చిత్తూర్ ప్రాంతం వాళ్లు వస్తే మా కాలెజి లో, ప్రత్యెకం గా పిలిసి మరీ ర్యాంగింగ్ చేసేవాళ్లు, అరవ భాష అని. అలగే చిత్తూర్ వాళ్లు కోస్తా ప్రాంతం లో వాడే ఊత పదాలను చాల చాల తాప్పు గా బావించి కోపం తెచ్చుకొంటారు తెలుసా!

ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నొ, దానికి ఎవరీ అత్మాభిమానాలు దెబ్బ తినక్కర్లేదు. ఇందులో త్యాగాల మాట అక్కర్లేదు. నేను తెలంగాణ వాడిని అయితే నా పిల్లలకు 'పల్లీలూ అనే నేర్పుతాను. కోస్తా వాడిని అయితే 'వేరుశనగా అని, రాయలసీమ వాడిని అయితే 'సెనక్కాయలూ అనే నేఎర్పుతాను.

మీరు అన్నట్లు ఇంకొకరి యాసను/భాషను ఎక్కిరించటం మాత్రం మంచి పద్దతి కాదు, కాకపోతే కాలెజ్ లు, స్కూళ్లలో ఈ ఎక్కిరింతలు కామనే కదా!!.