Monday, August 18, 2008

నల్లని ముసుగు

నల్లని ముసుగు నెత్తి నిండుగా కప్పుకొని
కోనేట్లో నీళ్లు దోసిట్లోకి తీసుకొని
వెనక్కి వేసుకోబోతే,
చేప పిల్లొకటి పరిచయమున్న దానిలా నవ్వింది.

నల్లని ముసుగుని నుదిటి మీదకనుకొని
సాయం సంధ్యలోని మసక వెలుగులో
మాడ వీధిలో నడుస్తుంటే
అమ్మవారి ఏనుగు తలపై ఆశీర్వదించింది, బరువుగా.


నల్లని ముసుగుని కొంచెం క్రిందకని,
వంచిన తల కొంచెం ఎత్తి
స్వామి వారి వైపు చూస్తే
ఎవర్నుండి దాచుకుంటావ్?
అంటూ చిర్వవ్వులు నవ్వాడు.

1 comment:

Bolloju Baba said...

కవితలో అందం, గూడత అద్భుతంగా ఉన్నాయి.
చాలా మంచి అందమైన హృద్యమైన కవిత.
బొల్లోజు బాబా