Thursday, September 18, 2008

మా తాత గురించి చరిత్ర పుస్తకంలో లేదేమిటి?

కరడు కట్టిన గుడ్డి తెలంగాణా వాది మన నవీన్ ఆచారి గారు బ్లాగు మొదలుపెట్టారు. వివిధ పత్రికలు మొన్నగు చోట్ల తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన వ్యాసాలు కాపీ పేస్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడూ తన కీబోర్డుకు కూడా పని చెపుతూ ఉంటారు. వారి బ్లాగుకు స్వాగతం.

అనుభవ పూర్వకంగా నేర్చుకున్నదేమిటంటే కొన్ని బ్లాగులపై కామెంటడం దండగ! దాని బదులు మరో బ్లాగులో రాసుకోవడం శుభ్రం. అటువంటి వాటిలో తాబాసు గారి బ్లాగు కూడా ఒకటి అనుకోండి. కాకపోతే ఆ విషయాన్ని ఆయన హుందాగా కామెంటే ముందే ఎర్ర అక్షరాలతో వ్రాశారు. నెనర్లు :)

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి

ఈ వ్యాసంలో ఇలా ప్రశ్నించారు కదా, దీనిని సమాధానం నవీన్ ఆచారి గారి దగ్గర లేదంటారా? ఉంది కానీ చూడటం ఇష్టంలేదు. ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

పీవీ నరసింహ రావు గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టినట్టు? వారిది తెలంగాణా కాదా?

ప్రకాశం పంతులు ఉదాహరణ ఇచ్చారు, అతన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి కారణం కాంగ్రేస్ వాది అనే కానీ, కోస్తా వాడు అనో, తెలంగాణా వాడు కాదు అనో నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

రైతాంగ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు? కారణాలు నవీన్ ఆచారికి తెలీదా?
1. ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు అనీ (లేకపోతే వారి వోట్లు పోతాయని)
2. వివాదాస్పదమైన విషయం అనవసరంగా గెలుక్కోవడం ఎందుకనీ

అంతే కానీ అది తెలంగాణాలో మాత్రమే జరిగిందనీ, కోస్తాలో జరగలేదని కాబట్టి పఠ్యపుస్తకాల్లో పెట్టలేదనే విషయం నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పుకున్నట్టు "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది".

అన్నట్టు దున్నపోతు ఈనిందంట తెలుసా?

తెలుసు ఇదంతా కోస్తా వాళ్ల కుట్ర. ప్రత్యేక తెలంగాణా కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవం కావాలి, అప్పుడే తెలంగాణాలో దున్నపోతులు ఈనకుండ ఉంటాయి. అని చెపుతారు ఈ కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాదులు.

శుభం.

19 comments:

సుజాత వేల్పూరి said...

wow!

Anonymous said...

nijanga,nijam..
aa madhya ilaage malli kanipincanlaa!

స్వేచ్ఛా విహంగం said...

ఇంకా నయం. నిజాం పాలనే బాగుంది అని అంటున్నారు మొన్న TV లో కొంత మంది హీరోలు.

Kalidasu said...
This comment has been removed by the author.
Kalidasu said...

బాబూ కళ్ళున్న కబొది. P V narasimha Rao తెలంగాణ సమర యోధుడు కాదు. అతను PM గా చెసినందుకు అతని గురించి పుస్తకాలల్లో వుంది. నీకు తెలుసా తెలంగాణ పోరాటం గురించి తెలిస్తె ఇలా రాయవు. ఆంధ్ర రాష్త్ర తొలి CM తెలుసు కాని. తెలంగాణ తొలి CM Boorgula Ramakrishna Rao అని ఎంత మందికి తెలుసు. ఊరికె మాట్లడడం కాదు తెలుసుకొని మాట్లదు. ముస్లిం సొదరులు ఇబ్బంది పదనిది దేనికి. వందే మాతరం పాడమంటె కూదా ఇబ్బంది వాల్లకు. అవును మీ బ్లాగులొ ఈనె వుంటుంది, మరి దూడను కట్టేయండి.

Anil Dasari said...

@కాళిదాసు:

బూర్గుల రామకృష్ణారావు హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణా రాష్ట్రానికి కాదు. ఆయన హైదరాబాదు రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి. మొదటి వాడు నారాయణ మీనన్.

కాకపోతే తెలంగాణావాదులు ఎలుగెత్తి చాటుకోటానికి ఓ చిన్న సంగతుంది. బూర్గుల హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి 'ఎన్నికైన ప్రభుత్వానికి' ముఖ్యమంత్రి.

ఇక, నిజాం వ్యతిరేక పోరాటం, భారత స్వతంత్ర పోరాటాల్లో పివి నరసింహారావు పాత్ర గురించి తమరు కాస్త చరిత్ర పుస్తకాలు తిరగేసి ఇక్కడికొస్తే బాగుంటుంది.అసలు ఆయన రాజకీయ జీవితం మొదలయిందే 1938లో హైదరాబాద్ ప్రావిన్స్ లో 'వందేమాతరం' వినపడకూడదన్న నిజాం ఆజ్ఞని ధిక్కరిస్తూ. ఆంధ్రావాళ్లెటూ పట్టించుకోరు కానీ, తెలంగాణాకి చెందిన గొప్ప నాయకులని ముందు మీరు గుర్తించండి.

Anonymous said...

@ yet another Telugu guy


మీరు జవాబు చెప్పే ప్రయత్నం చేసారు కాని పొంతన కుదరలేదు.

సాయుధపోరాటం ముస్లీం లకు కు వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇది ఒక వ్యవస్థ కు వ్యతిరేకంగా జరిగింది. ఇందులో నిజాం, ఆయన కింద వందలాది మంది హిందూ జాగిర్దార్లు అందరూ పాత్రలే. నిజాం ప్రజలకు పరోక్ష ప్రభువు. నిత్యం వారిని వేధించుకొని తిన్నది భుస్వాములు జమిందార్లే. వారంతా హిందువులే. స్పష్టంగా చెప్పాలంటే నిజాం ఆక్రుత్యాలు కేవలం చివరిరోజుల్లోనే జరిగాయి. కాని వందల సంవత్సరాలుగా జనాన్ని నరకయాతన పెట్టింది హిందూ భూస్వాములే కాని ముస్లీం భూస్వాములు కాదు. తెలంగాణ పోరాటంలో ముక్దూం మొహియొద్దీన్ లాంటి గొప్ప జర్నలిస్టుల్ని చంపాడు నిజాం. బందగీ, తుర్రేబాజి ఖాన్ లాంటి వీరులు చనిపోయారు. రజాకార్ల అక్రుత్యాలు చివర్లో మాత్రమే జరిగాయి. మిగతా వందల సంవత్సరాలు నడిచింది భూస్వాముల దురాగతాలే. నిజాం 5 రూపాయల టాక్స్ అంటే 50 రూపాయల టాక్స్ వసూలు చేసారు దొరలు. సాటి హిందూ స్త్రీలను చెరచమని నిజాం ఎవరికి చెప్పలేదు. నిజాం దారుణాలు చేసాడు. ఐతే అవి దొరల ఘోరాల కన్నా చాలా తక్కువ. కాబట్టి ముస్లీంస్ బాడపడతారని అలా చేసారనడం సత్యదూరమే అవుతుంది.


ముస్లీంస్ బాదపడతారని తెలంగాణ పోరాటాన్ని రాయలేదు అనడం కరెక్ట్ కాదు. మరి శివాజి గురించి బడి పుస్తకాల్లో ఉంది ఎందుకు..? వీర సావర్కర్ పేరు ఎందుకు ఉంది..? వందేమాతరం గురించి ఎందుకు ఉంది..? ఇక్కడ ముస్లీంస్ బాడపడరా..? కేవలం తెలంగాణ ఉద్యమం పుస్తకాల్లో పెడితే బాదపడతారా..?

మీ సమాధానం సహేతుకం అనిపించడం లేదు.

Anonymous said...

>>బాబూ కళ్ళున్న కబొది.
:D

>>P V narasimha Rao తెలంగాణ సమర యోధుడు కాదు.
>>అతను PM గా చెసినందుకు అతని గురించి పుస్తకాలల్లో వుంది.
అబ్రకదబ్ర నెనర్లు.
>> నీకు తెలుసా తెలంగాణ పోరాటం గురించి తెలిస్తె ఇలా రాయవు.
తెలుసు, ఎందుకంటే మా తాత కూడా దాంట్లో ఉన్నాడు.
>> ఆంధ్ర రాష్త్ర తొలి CM తెలుసు కాని. తెలంగాణ తొలి CM Boorgula Ramakrishna Rao అని ఎంత మందికి తెలుసు.
తెలుసు.
>>ఊరికె మాట్లడడం కాదు తెలుసుకొని మాట్లదు. ముస్లిం సొదరులు ఇబ్బంది పదనిది దేనికి. వందే మాతరం పాడమంటె కూదా ఇబ్బంది వాల్లకు.


ముస్లింలు కాకపోతే మరో కారణం, దానిక్కూడా ప్రత్యేక తెలంగాణానే సమాధానం కాదు అని. అలా చూస్తే ప్రత్యేక తెలంగాణా దేశం కావాలి. భారత్ తో కలవటం వల్ల ఇంకా ఎక్కువే కోల్పోతున్నామ్.

>>అవును మీ బ్లాగులొ ఈనె వుంటుంది, మరి దూడను కట్టేయండి.
:)

Anonymous said...

ఏక్కడా.. ఈ వ్యాసం రాసిన పెద్దాయన. రాయడనికి జవాబులు లేక మొహం చాటేసాడా...?? మరి నా రిప్లయ్ కి స్పందన లేదేమీ..?

మీ తాత కన్నా లక్ష రేట్ల గొప్పది తెలంగాణ చరిత్ర. దానితో పోల్చుకునే స్థాయి మీకూ మీ తాతకు లేదని నా మనవి.


నవీన్ రాసింది ముమ్మాటికి కరెక్టే.


ఆయన రాసిన అన్ని విషయాల్లో కేవలం ఒకే పాయింట్ నువ్వు రాసావు. ఆ ఒక్కదానికి కూడా జవాబిస్తే నీ నుంచి సౌండ్ లేదు.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Yet Another Telugu Guy said...

మీరు జవాబు చెప్పే ప్రయత్నం చేసారు కాని పొంతన కుదరలేదు.
<< It happens.

సాయుధపోరాటం ముస్లీం లకు కు వ్యతిరేకంగా జరిగింది కాదు. ఇది ఒక వ్యవస్థ కు వ్యతిరేకంగా జరిగింది. ఇందులో నిజాం, ఆయన కింద వందలాది మంది హిందూ జాగిర్దార్లు అందరూ పాత్రలే. నిజాం ప్రజలకు పరోక్ష ప్రభువు. నిత్యం వారిని వేధించుకొని తిన్నది భుస్వాములు జమిందార్లే. వారంతా హిందువులే. స్పష్టంగా చెప్పాలంటే నిజాం ఆక్రుత్యాలు కేవలం చివరిరోజుల్లోనే జరిగాయి. కాని వందల సంవత్సరాలుగా జనాన్ని నరకయాతన పెట్టింది హిందూ భూస్వాములే కాని ముస్లీం భూస్వాములు కాదు. తెలంగాణ పోరాటంలో ముక్దూం మొహియొద్దీన్ లాంటి గొప్ప జర్నలిస్టుల్ని చంపాడు నిజాం. బందగీ, తుర్రేబాజి ఖాన్ లాంటి వీరులు చనిపోయారు. రజాకార్ల అక్రుత్యాలు చివర్లో మాత్రమే జరిగాయి. మిగతా వందల సంవత్సరాలు నడిచింది భూస్వాముల దురాగతాలే. నిజాం 5 రూపాయల టాక్స్ అంటే 50 రూపాయల టాక్స్ వసూలు చేసారు దొరలు. సాటి హిందూ స్త్రీలను చెరచమని నిజాం ఎవరికి చెప్పలేదు. నిజాం దారుణాలు చేసాడు. ఐతే అవి దొరల ఘోరాల కన్నా చాలా తక్కువ.
<< తెలుసు.
కాబట్టి ముస్లీంస్ బాడపడతారని అలా చేసారనడం సత్యదూరమే అవుతుంది.
<< ఆహా!

<< కేసీఆర్ నిజాం ని పొగడటం కూడా ముస్లింలను సంతోష పెట్టడం కోసం కాదు. అలా అనడం కేవలం సత్య దూరమే.

<< ఒక్క ఆధారం చూపండి తెలంగాణా పోరాటం కేవలం కోస్తా వాళ్ల దురహంకారం వల్ల మాత్రమే పాఠ్యపుస్తకాల్లో పెట్టలేదనడానికి. కేవలం కాంగ్రేస్ పార్టీ దురహంకారం, నెహ్రూ కమ్యునిస్టు వ్యతిరేకత వల్ల మాత్రమే దానికి చోటు దక్కలేదనేది ఇంకా నా అభిప్రాయం. ఆ తరువాత ముస్లిం ఫ్యాక్టర్ కూడా వచ్చి చేరింది. ముస్లింలు అనుకుంటారని మన తెల్ల టోపీ,ఆకు పచ్చ కండవా స్టేజ్ నాయకులు అనుకోవడం వల్లే అసలు సమస్య పాపంమెజార్టీ ముస్లింలు ఏమీ అనుకోకపోయినా అదర్ పార్టీ వాళ్లు అనుకోచేస్తారేమో అని మరో భయం .



ముస్లీంస్ బాదపడతారని తెలంగాణ పోరాటాన్ని రాయలేదు అనడం కరెక్ట్ కాదు. మరి శివాజి గురించి బడి పుస్తకాల్లో ఉంది ఎందుకు..? వీర సావర్కర్ పేరు ఎందుకు ఉంది..? వందేమాతరం గురించి ఎందుకు ఉంది..? ఇక్కడ ముస్లీంస్ బాడపడరా..? కేవలం తెలంగాణ ఉద్యమం పుస్తకాల్లో పెడితే బాదపడతారా..?
<< నో కామెంట్స్
మీ సమాధానం సహేతుకం అనిపించడం లేదు.
<< మే బీ

Yet Another Telugu Guy said...

ఏక్కడా.. ఈ వ్యాసం రాసిన పెద్దాయన. రాయడనికి జవాబులు లేక మొహం చాటేసాడా...?? మరి నా రిప్లయ్ కి స్పందన లేదేమీ..?
<< సహనం!
మీ తాత కన్నా లక్ష రేట్ల గొప్పది తెలంగాణ చరిత్ర. దానితో పోల్చుకునే స్థాయి మీకూ మీ తాతకు లేదని నా మనవి.
< < తెలుసు, కాకపోతే మన వాడు ఎవడన్నా ఫలక్ నామా ప్యాలస్ లో ఉంటే దాని గురించి మనకు ఎక్కువ సమాచారం తెలుస్తుంది కదా, ఆ యాంగిల్ లో మాత్రమే తాతను తెచ్చాను. ఎవరు గొప్ప అనే పోలిక నేను తేలేదు.

నవీన్ రాసింది ముమ్మాటికి కరెక్టే.
<< ముమ్మాటికీ కరక్ట్ కాదనే నా ఉద్దేశ్యం. హీ ఈజ్ జస్ట్ బ్లైండ్ విత్ బ్లైండ్ తొట్టి గ్యాంగ్ ఆన్ హిజ్ బ్యాక్.

ఆయన రాసిన అన్ని విషయాల్లో కేవలం ఒకే పాయింట్ నువ్వు రాసావు. ఆ ఒక్కదానికి కూడా జవాబిస్తే నీ నుంచి సౌండ్ లేదు.

<< సహనం!

Yet Another Telugu Guy said...

అనామకా,

ఈ బ్లాగు తెలంగాణాపై మీ ద్వేషాన్ని వెల్లగక్కటానికి వేదిక కాదు. వ్యాసంతో సంబంధంలేని మీ కామెంట్ తొలగించాము.

దాని ఫాలో అప్ కూడా.

Anonymous said...

పుస్తకాల్లో పెట్టకపోవడానికి ఆంధ్రా వాళ్లంతా కారణం కాకపోవచ్చు ఐతే కారణమైన వాళ్లు మాత్రం ఆంధ్రా వాళ్లే. ఎందుకంటే ముస్లీంస్ బాదపడతారని చెయ్యలేదు అనడమే నిజం ఐతే ముస్లీంస్ బాదపడతారని తెలిసీ మిగతావి ఎందుకు చేర్చారో పుస్తకాల్లో చెప్పగలరా..!

ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం పదవిలో ఉన్నది నెహ్రూ కుటుంబీకులు & కాంగ్రేస్ మాత్రమే. ఆ సమయం లో నే పాఠ్యపుస్తకాల్లో వందేమాతరం, శివాజి, వీర్ సావర్కర్ గురించి పెట్టడం జరిగింది. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో స్కూల్ బుక్స్ లో పెట్టకపోవడానికి నెహ్రూ కారణం అనడం ఒక కుంటి సాకు మాత్రమే.

అసలు విషయానికి సమాధానం ఇవ్వకుండా వేరే వాళ్లను బ్లైండ్ అని అక్కసు వెళ్లగక్కడమే చెప్తుంది ఎవరు బ్లైండో.

మీ తాత ఏం చేసాడని పుస్తకాల్లో ఉండాలంటారూ..?? (కుతూహలం కొద్దీ అడుగుతున్నా..)

Anonymous said...

మీరు పన్ కాచ్ చేసినట్టు లేరు :( ఇదే విషయాన్ని పక్క వాడిపై ద్వేషం లేకుండా వ్రాసినట్టయితే నవీన్ గారిపై నేను ఈ విమర్శ చేయాల్సి వచ్చేది కాదు.

Anonymous said...

Panileni vaalu raasina daniki malli inkoka blog create chesi discussion pettaalaa? Malli comment delete ani abipraayalanu tolaginchatamu. you are all trying to improve your writing skills other than that there is no use for these kind of discussions. Don't give reply and waste your time bcs I am not going to visit this blog.
ThanX

Anonymous said...

@ Above Anonymous

asalu nuvvu icchina answer emi ledhu. ayana elagu delete chesadani kottha kottha kathalu cheppaku. Already niku icchina punch kuda delete aipoyindi.emanna cheppedhi unte ippudu rayu.malli istha answer :-)

@ Blog owner

please ayana comments delete cheyakandi. daniki nenicche replies kuda..!!