Tuesday, July 22, 2008

(సశేషం)

ఓ రోజు,
వస్తాయనుకున్న మబ్బులు రాక
చల్లబడ్తాడనుకున్న సూర్యుడు అలాగే మండుతుంటే
అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన బతికిపొయిన
గరర్నమెంటు చెట్టు నీడలో సేదతీరుతుంటే
నువ్వు మొదటిసారిగా కన్పించావు.

అంత ఏండలోనూ
నాలుగాకుల నీడ కింద
ఏడుపు లేకుండా నవ్వులేకుండా
నీ లోకంలో నువ్వాడుకుంటున్నావు.

ఎవరైనా వస్తారేమో అని చూసి,
ఎవరూ రాకపొయ్యేసరికి ఆశ్చర్యపొయి
భుజంపై వేసుకోని లాలించి
ఊరంతా తిరిగి చూసి
అందరికీ వివరించి చెప్పి
ఎవరికీ ఏమీ కానివాడవని
నాదగ్గరే ఉంచుకున్నాను.

అడుగులో అడుగు వేస్తూ
పడుతూ లేస్తూ నడుస్తుంటే
ఎంతో మురిసిపొయినాను.
గుండెలమీదుంచుకొని నిద్రోయినాను.

నిన్ను చూపించి సుద్దులు నేర్పుతుంటే,
ఊరంతా తిరిగి గొప్పలు చెప్పుకొని
ఎంతో మురిసి పొయినాను.

(సశేషం)

2 comments:

Bolloju Baba said...

కవిత పేరు సశేషమా లేక కవితే సశేషమా?
బొల్లోజు బాబా

Yet Another Telugu Guy said...

కవితే సశేషం.

పేరు ఇంకా పెట్టలేదు.

మిగిలింది పూర్తి చెయ్యడానికి మళ్లా మూడ్ ఎప్పుడు వస్తుందో ఏమో !